ఎన్నికల కమిషనర్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ బృందం | YSRCP Members Meet EC Neelam Sahni | Sakshi
Sakshi News home page

ఎన్నికల కమిషనర్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ బృందం

Apr 7 2025 3:55 PM | Updated on Apr 7 2025 4:22 PM

YSRCP Members Meet EC Neelam Sahni

విజయవాడ:  తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నికకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కలిసింది వైఎస్సార్‌సీపీబృందం. ఈ ఎన్నికపై ఏపీలోని కూటమి ప్రభుత్వం అవిశ్వాసం పెట్టి  తద్వారా ఎన్నిక వాయిదా  వేయాలని కుట్రకు తెరలేపిన నేపథ్యంలో వైఎస్సార్‌సీపీసభ్యులు మల్లాది విష్ణ/,  వైఎస్సార్‌సీపీఎంప్లాయిస్ పెన్షనర్స్  వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్ చంద్రశేఖర్ రెడ్డి,  వైఎస్సార్‌సీపీఎస్సీ సెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావులు ఎన్నికల కమిసనర్ ను కలిశారు.

అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ..  ‘వెంకటగిరి మున్సిపల్  చైర్మన్ ఉపఎన్నిక పై ఈసీని కలిశాం. వెంకటగిరిలో 25 కార్పోరేటర్లను వైఎ‍స్సార్ సీపీ గెలిచింది. ఈ ప్రభుత్వం దౌర్జన్యంగా అవిశ్వాసం ప్రవేశపెట్టింది.  దీని ద్వారా మరొకవైపు ఎన్నిక వాయిదా వేసేందుకు అధికార పార్టీ కుట్ర చేస్తోంది. ఈనెల 9వ తేదీన జరగబోయే ఎన్నిక వాయిదా వేయాలని చూస్తోంది. ఎన్నిక వాయిదా పడకుండా చూడాలని ఈసీని కోరాం. 9వ తేదీనే జరిగేలా చూడాలిన కోరాం. భయపెట్టి...బెదిరించి గెలవాలని చూడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధం.  కలెక్టర్లకు సరైన ఆదేశాలివ్వాలని కోరాం. సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణలో ఎన్నిక జరపాలి’ అని ఈసీని కోరామన్నారు మల్లాది విష్ణు. 

Advertisement
 
Advertisement
Advertisement