చంద్రగిరి: ఓ కాంట్రాక్టర్‌కు చెందిన బిల్లులను మంజూరు చేయడం కోసం లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు పట్టుబడిన అప్పటి పంచాయతీ ఈఓ మహేశ్వరయ్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2025 ఫిబ్రవరి 28వ తేదీన ఆయన్ను ఏసీబీ అధికారులు పట్టుకున్న తర్వాత ఆయనపై పలు కేసులు నమోదు చేశారు. అనంతరం ఆయన అక్రమాస్తులు, కుటుంబ సభ్యులపై కొనుగోలు చేసిన ప్లాట్లు, ఇల్లు, ఫాం హౌస్‌లపై విచారణ చేపట్టారు. బంగారు ఆభరణాలు, ఫిక్సిడ్ డిపాజిట్లను వివరాలను సేకరించారు. ఆయన అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించిన అధికారులు వాటిని కోర్టుకు సమర్పించారు. దీంతో అక్రమాస్తుల జప్తుకు ఆదేశాలు ఇస్తూ నెల్లూరు ఏసీబీ కోర్టు మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. 2008 నుంచి 2025వ సంవత్సరం వరకు సుమారు రూ.3.41 కోట్లు కూడబెట్టినట్లుగా అధికారులు గుర్తించారు. వాహనాలు, పరికరాలను జప్తునకు ఉత్తర్వులు జారీ చేసింది.


