
తాడేపల్లి : తమ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలకు ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ప్రశ్నించారు వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్. ప్రజాదరణ ఉన్న వ్యక్తికి భద్రత కల్పించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందనే విషయాన్ని భరత్ గుర్తు చేశారు. ఈరోజు(మంగళవారం, జూలై 29) తాడేపల్లి నుంచి ‘సాక్షి’తో మాట్లాడిన మార్గాని భరత్.. ‘ మేము అడ్డంకులు సృష్టిస్తే లోకేష్ పాదయాత్ర చేసేవారా?, జగన్ భద్రతపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. రోడ్డుపైకి చంద్రబాబు వెళ్తే ప్రజలు రావడం లేదు. అందుకే జగన్ పర్యటనలపై కక్ష కట్టారు.
ప్రసన్న కుమార్‌రెడ్డి ఇంటికి జగన్ వెళ్తే మీ రూల్స్ ఏంటి?, జగన్ పర్యటనలకు రోప్ పార్టీ ఇవ్వడం లేదు. ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన రాజులు కాదు.. ఇది రాచరికం కాదని ప్రభుత్వం గుర్తు పెట్టకోవాలి రెడ్‌బుక్ పేరుతో చేస్తున్న అరాచకాలను రాయడానికి ఏ బుక్ సరిపోవడం లేదు. వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు చేసిన ఎవరినీ వదిలిపెట్టం. డిజిటల్ లైబ్రరీ తెస్తున్నాం అందరి పేర్లు డేటాతో సహా సేవ్ చేస్తున్నాం. దాడులు వేసిన వారికి అసలు, వడ్డీతో సహా కలిపి ఇస్తాం’ అని మార్గాని భరత్ హెచ్చరించారు.
