సాక్షి, నెల్లూరు జిల్లా: శ్రీశైలం ప్రాజెక్టులో నీటిని ఉపయోగించుకోవడంలో కూటమి పూర్తి స్థాయిలో విఫలం అయిందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. శ్రీశైలంలో నుంచి సోమశిల, కండలేడు జలాశయాలకు ఎందుకు విడుదల చేయడం లేదు? అంటూ ప్రశ్నించారు.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగులేటర్‌ను ఉపయోగించి వెంటనే ఎందుకు నీరు వినియోగించడం లేదు. నెల్లూరు, రాయలసీమ రైతులను నిట్టనిలువుగా ముంచడమే చంద్రబాబు ఉద్దేశమా?. నెల్లూరులో జలాశయాలు అడుగంటి పోయే పరిస్థితి ఏర్పడింది. 71 శాతం వరకు పుష్కలమైన నీరు శ్రీశైలంలో వున్న నీటిని వినియోగించుకోకపోవడంలో మీ దురుద్దేశం ఏంటి? అంటూ కాకాణి నిలదీశారు.
‘‘మరో వైపు తెలంగాణ శ్రీశైలం నీటి ఎడాపెడా దోచుకుంటున్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఏపీ రైతుల జీవితాలను తాకట్టు పెడుతున్నాడా..?. నీటి యాజమాన్య పద్దతులను ఏనాడు పాటించిన పాపాన పోలేదు. మొదటి పంటకే నీరు కరువైంది. నెల్లూరు జిల్లా రైతాంగం ఆందోళన చేపట్టే పరిస్థితులు తలెత్తాయి’ అని కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: అలిగి వెళ్లిపోయిన దానం నాగేందర్


