సాక్షి, అల్లూరి జిల్లా: విద్యార్థుల తల్లిదండ్రులు, వైఎస్సార్‌సీపీ పోరాటంతో కూటమి ప్రభుత్వం దిగొచ్చింది. మారికవలస గురుకుల పాఠశాలను యథాతధంగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది మారికవలస గురుకుల పాఠశాలను యథాతధంగా కొనసాగించాలని.. లేదంటే నేడు సీఎం చంద్రబాబు అరకు పర్యటనను అడ్డుకుంటామని విద్యార్థుల తల్లిదండ్రులు, వైఎస్సారర్‌సీపీ హెచ్చరించింది. తల్లిదండ్రులు, వైఎస్సార్‌సీపీ పోరాటంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మారికవలస స్కూల్ యథాతదంగా కొనసాగించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది.
విద్యార్థులు తల్లిదండ్రులకు హామీ ఇచ్చిన అధికారులు.. అల్లూరి జిల్లా నుంచి మారికవలసకు బస్సుల్లో విద్యార్థలను తరలించారు. మారికవలస స్కూల్ యథావిధిగా కొనసాగించాలని గత కొన్ని రోజులుగా విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. విద్యార్థులు తల్లిదండ్రుల పోరాటానికి వైఎస్సార్‌సీపీ అండగా నిలిచింది.
వైఎస్ జగన్ హెచ్చరికలతో..
అమరావతి: పంటల బీమా పథకం ద్వారా పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర వాటా ప్రీమియం సబ్సిడీ చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరికలతో సర్కారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) ద్వారా పెండింగ్ ప్రీమియం బకాయిలు రూ.500 కోట్లు విడుదలకు పరిపాలనా అనుమతి మంజూరు చేస్తూ శుక్రవారం వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ జీవోఆర్‌టీ నంబర్ 821ను జారీ చేశారు.
ఇదీ చదవండి: సంక్షోభంలో కృష్ణా బేసిన్
కరువు కాటేస్తున్నవేళ చంద్రబాబు ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించు కోకుండా కుంభకర్ణుడి నిద్రలో ఉందంటూ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కారు ఆఘమేఘాల మీద పెండింగ్ ప్రీమియం బకాయిల కోసం నిధులు విడుదల చేయడం చర్చనీయాంశమైంది.


