సాక్షి, తాడేపల్లి: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ.. వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
‘‘వాడుక తెలుగుకు కొత్త వెలుగునిచ్చిన విశిష్ట భాషావేత్త గిడుగు వెంకట రామమూర్తి పంతులు. ప్రజలు మాట్లాడే భాషకు విద్యా, సాహిత్య రంగాల్లో.. సముచిత స్థానం కల్పించేందుకు కృషి చేసిన ఆ మహనీయుని భాషా సేవలు తరతరాలకు స్ఫూర్తి. గిడుగు గారి జయంతిని పురస్కరించుకుని నేడు నిర్వహించుకుంటున్న తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
వాడుక తెలుగుకు కొత్త వెలుగునిచ్చిన విశిష్ట భాషావేత్త గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు. ప్రజలు మాట్లాడే భాషకు విద్యా, సాహిత్య రంగాల్లో సముచిత స్థానం కల్పించేందుకు కృషి చేసిన ఆ మహనీయుని భాషా సేవలు తరతరాలకు స్ఫూర్తి. గిడుగు గారి జయంతిని పురస్కరించుకుని నేడు నిర్వహించుకుంటున్న… pic.twitter.com/tTKbMnguS0
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 29, 2026


