సాక్షి, విశాఖపట్నం: నగరంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరు పిల్లలతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను భర్త ప్రవీణ్, భార్య అహల్య, ఇద్దరు చిన్నారులు హితిక్స, హన్విగా గుర్తించారు. పెందుర్తి మండలం చింతల అగ్రహారంలో ఘటన జరిగింది. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు భావిస్తున్నారు.
ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే ప్రవీణ్.. ఆర్థిక ఇబ్బందులు కారణంగా భార్యాపిల్లలకు విషమిచ్చి తాను ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి: జిమ్ ట్రైనర్ సతీష్‌రెడ్డి కేసులో కొత్త ట్విస్ట్


