హిందూపురంలో కాల్పుల కలకలం | Police Open Fire On A Gang Of Thieves In Sri Sathya Sai District | Sakshi
Sakshi News home page

హిందూపురంలో కాల్పుల కలకలం

Aug 29 2026 8:48 AM | Updated on Aug 29 2026 8:58 AM

Police Open Fire On A Gang Of Thieves In Sri Sathya Sai District

సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: హిందూపురంలో కాల్పుల కలకలం రేగింది. దొంగల ముఠాపై పోలీసులు కాల్పులు జరిపారు. దొంగల ముఠాపై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. పోలీసుల నుంచి ముఠా తప్పించుకుని పారిపోయింది. పరిగి మండలం ఊటుకూరు దగ్గర ఘటన జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల క్రితం హిందూపురం పట్టణంంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.

అయితే, బోలేరో వాహనంలో వెళ్తున్న దొంగల ముఠా ఆగకుండా వెళ్లిపోయారు. ఏపీ- కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో రెండు గంటల పాటు పోలీసులు ఛేజ్‌ చేశారు. పరిగి మండలం ఊటుకూరు దగ్గర పోలీసులు కాల్పులు జరిపారు. దుండగులు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయారు. ఈ నెల 6వ తేదీన దుండగులు పోలీసు జీపును ఢీకొన్నారు. ఇప్పుడు కూడా అదే గ్యాంగ్ హిందూపురంలో సంచరిస్తున్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దొంగల ముఠా కోసం హిందూపురం పోలీసులు గాలిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement