‘అంతా ఆ ఉంగరం వల్లే’.. | Chinchinada Bridge Incident | Sakshi
Sakshi News home page

‘అంతా ఆ ఉంగరం వల్లే’..

Aug 29 2026 7:35 AM | Updated on Aug 29 2026 7:59 AM

Chinchinada Bridge Incident

అప్పుల ఊబిలో చిక్కుకున్న ఆ కుటుంబంలో ఆశల దీపాలు ఒక్కసారిగా ఆరిపోయాయి. ‘అమ్మా.. నాన్న.. ఎప్పుడొస్తారు?’ అంటూ ఆ పసికవలలు అడుగుతున్న ప్రశ్నలకు ఆ ఇల్లంతా మూగబోయింది. రూ.50 వేల విలువైన ఉంగరం కోసం సాగిన వేధింపులు, బెదిరింపులు చివరికి ఆ దంపతులను గోదావరి ప్రవాహంలోకి నెట్టేశాయి. రెండేళ్ల క్రితం తీసుకున్న చిన్న బాకీ, మానసిక ఒత్తిడి ఆ దంపతుల ప్రాణాలను బలిగొనగా, అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలను అనాథలను చేసింది. ఈ విషాద ఘటన ఊరందరినీ కంటతడి పెట్టిస్తోంది.

తణుకు అర్బన్‌ : యలమంచిలి మండలం చించినాడ బ్రిడ్జిపై నుంచి దంపతులు గోదావరిలోకి దూ కిన ఉదంతం కలకలం రేపుతోంది. ఆర్థిక సమస్య లు, ఒత్తిళ్లు, బెదిరింపులు వీరి ఆత్మహత్యాయత్నానికి కారణంగా తెలుస్తోంది. అమ్మా.. నాన్న.. అంటూ విలపిస్తున్న పసిపిల్లలు, కుమారుడు, కోడలును పోగొట్టుకున్న తల్లిదండ్రుల రోదనలతో వే ల్పూరులో విషాదఛాయలు అలముకున్నాయి. వే ల్పూరుకు చెందిన దొడ్డా వెంకట ధన సాయికృష్ణ అలియాస్‌ డీవీడీ (32), భార్య శిరీష (28)కు ఐదేళ్ల క్రితం వివాహమైంది.

గురువారం రాత్రి వీరిద్దరూ గోదావరి దూకి ఆత్మహత్యకు యత్నించారు. వేల్పూరులో నివసిస్తున్న సాయికృష్ణ కొన్ని నెలల నుంచి భీమవరంలో బంధువుల ఇంట్లో ఉంటున్నాడు. వివాహానికి ముందు ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ దేశంలో కొంతకాలం పనిచేశాడు. స్వదేశానికి వచ్చిన తర్వా త శిరీషను వివాహం చేసుకుని కొన్నాళ్లు హైదరాబాద్‌లో అంబులెన్స్‌ డ్రైవర్‌గానూ జీవనం సాగించాడు. అనంతరం వేల్పూరులో రెడీమేడ్‌ వస్త్ర దుకాణం నిర్వహించినా వ్యాపారం లేక అప్పులపాలై దుకాణం మూతపడింది. ఆర్థిక సమస్యల నేపథ్యంలో తల్లితండ్రులు వెంకటేశ్వరరావు, దుర్గ వారి ఇంటిని సైతం విక్రయించి ప్రస్తుతం అద్దె ఇంట్లో నివసిస్తుండగా కొంతమేర రుణాల నుంచి బయటపడినట్టు తెలుస్తోంది. సాయికృష్ణ దంపతులకు కుమారుడు, కుమార్తె (కవలలు) ఉన్నారు.  

హింస పెట్టి, నానా మాటలు అన్నారు 
‘నేను ఒకరి వద్ద ఉంగరం తీసుకుని ఇవ్వలేకపోయాను. దీంతో వారు మమ్మల్ని హింసపెట్టి నానామాటలు అనడం, చేసిన రాద్ధాంతంతో టెన్షన్‌ వచ్చి ఉండలేకపోయాం. పరిస్థితులు బాగోనప్పుడు.. నానామాటలు పడటంతో ధైర్యం చాలక ఏంచేయాలో తెలియక ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే మేం చేసిన అప్పులు మా అ మ్మా నాన్న తీర్చారు.. మా చావుకు మా అమ్మ నాన్నలకు ఎటువంటి సంబంధం లేదు..’ 
– సాయికృష్ణ మాట్లాడినట్టు
వైరల్‌ అవుతున్న వాయిస్‌ రికార్డింగ్‌

గోదావరిలో కొనసాగుతున్న గాలింపు  
యలమంచిలి: చించినాడ వద్ద వశిష్ట గోదావరిలో దొడ్డా సాయికృష్ణ, శిరీష దంపతుల కోసం శుక్రవారం పోలీసుల గాలింపు కొనసాగింది. ఎస్సై మోటూరి రాజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీం సభ్యులు సంయుక్తంగా స్పీడ్‌ బోట్లలో చించినాడ నుంచి ఏనుగువానిలంక, రామరాజులంక వైపు గాలించారు. రాత్రి 7 గంటల వరకు గాలించినా ఆచూకీ లభించకపోవడం, మరో వైపు చీకటి పడడంతో గాలింపు ఆపివేశారు. ఆదివారం ఉదయం మళ్లీ గాలింపు కొనసాగిస్తామని ఎస్సై రాజ్‌కుమార్‌ చెప్పారు.  

ఉంగరం కోసం రాద్ధాంతంతోనే.. 
దొడ్డా వెంకటేశ్వరరావు (సాయికృష్ణ తండ్రి) 
తమ సమీప నివాసితుడైన రవి అనే వ్యక్తి నుంచి తీసుకున్న ఉంగరం దంపతుల ప్రాణంపైకి వచ్చిందని సాయికృష్ణ తల్లితండ్రులు చేస్తున్న ఆరోపణలు సంచలనంగా మారాయి. రెండేళ్ల క్రితం రవి నుంచి తీసుకున్న ఉంగరాన్ని తమ కుమారుడు తాకట్టు పెట్టి తిరిగి ఇవ్వలేకపోయాడని, గురువారం రవి కొందరు వ్యక్తులను వెంటపెట్టుకుని వచ్చి ఉంగరం కోసం చేసిన ఒత్తిడి, రాద్ధాంతం చేశాడని అన్నారు. ఈ కారణంగానే తన కుమారుడు, కోడలు బలవన్మరణానికి పాల్పడ్డారంటూ తల్లితండ్రులు మీడియా వద్ద వాపోయారు. 

ముందుగా వేల్పూరులో తమ ఇంటికి వచ్చి దుర్భాషలాడారని, అనంతరం భీమవరం వెళ్లి సాయికృష్ణ, శిరీషను ఇష్టానుసారంగా మాట్లాడి దాడికి దిగబోయారని కన్నీళ్లపర్యంతమయ్యారు. పసిపిల్లలను చూసి కూడా వారికి జాలి కలగలేదని కేవలం రూ.50 వేల కోసం తమను నానా మాటలు అన్నారంటూ వాపోయారు. ఇదిలా ఉండగా కొద్దిరోజుల క్రితం సాయికృష్ణ ఫ్యాన్‌కు ఉరేసుకుని చేసిన సెల్ఫీ వీడియో కూడా వైరల్‌గా మారడం తాజాగా గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఈ ఘటనలో అసలు ఏం జరిగిందో తేలాల్సి ఉండగా, దీనిపై ఎ టువంటి ఫిర్యాదులు అందలేదని తణుకు రూరల్‌ ఎస్సై నాళం శ్రీనివాసరావు తెలిపారు.  

చదవండి: వీడియో కాల్‌ వైద్యానికి గర్భిణి మృతి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement