కాఠ్మాండు: చైనా, నేపాల్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన భారీ ఆకస్మిక వరదల వేళ బాధితులకు సాయం చేయాల్సిందిపోయి చోరీలకు పాల్పడ్డారు ఇద్దరు యువకులు. నారాయణి నదిలో వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన ఓ మహిళ మృతదేహం నుంచి బంగారు చెవిదుద్దులు చోరీ చేశారు. వారిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
వరదలో కొట్టుకుపోయిన ఓ మహిళ మృతదేహాన్ని జుట్టు పట్టుకునిలాగిన ఇద్దరు వ్యక్తులు బంగారు చెవిదుద్దులను తీస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ అరెస్టులు జరిగాయి. నేపాల్ పోలీసులు ఆ 41 సెకన్ల వీడియోను తమ ఖాతాలోనూ పోస్ట్ చేశారు.
వీడియోలో ఆ ఇద్దరు వ్యక్తులు చెక్క పలకలు, మహిళ జుట్టు ఉపయోగించి నీటిలో నుంచి ఆమె మృతదేహాన్ని బయటకు లాగడం కనిపించింది. తర్వాత ఆమె రెండు చెవుల నుంచి చెవిదుద్దులను తీసి పక్కన పెట్టారు. ఈ ఘటన జరుగుతుండగా పలువురు చుట్టూ నిలబడి వీడియోలు చిత్రీకరించారు.
తర్వాత చిత్వన్ పోలీసులు దర్యాప్తులో ఈ ఘటనకు సంబంధించిన మృతదేహం భారీ వరద కారణంగా నారాయణి నదిలోకి కొట్టుకుపోయినట్లు గుర్తించారు. వీడియో ఆధారంగా పోలీసులు 25 ఏళ్ల మదన్ గురుంగ్, 38 ఏళ్ల ఉమేశ్ చౌదరీని గుర్తించారు. నేపాల్ మీడియా సంస్థ ఖబర్‌హబ్ పోలీసులను ఉటంకిస్తూ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం భరత్‌పూర్ మహానగరపాలక సంస్థ-1లోని పోఖరా బస్ పార్క్ సమీపంలో ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశారు. విపత్కర పరిస్థితుల్లో బాధితులను లక్ష్యంగా చేసుకుని దోపిడీకి పాల్పడటం లేదా ఎలాంటి అమానవీయ చర్యలకు పాల్పడటాన్ని సహించబోమని పోలీసులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: నార్వే రాజు హరాల్డ్-5 ఇకలేరు
కాగా, నేపాల్‌లో గత కొన్నేళ్లలో సంభవించిన అత్యంత ప్రాణాంతక వరద విపత్తుల్లో ఈ ఘటన ఒకటి. నేపాల్-టిబెట్ సరిహద్దును ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో కొన్ని వందల మందికి పైగా ఆచూకీ లేకుండా పోయారు. వారి కోసం సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. సరిహద్దు మార్గానికి వెళ్లే రహదారులన్నీ దెబ్బతిన్నాయి. ప్రాంతంలో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి భూకంపనలు లేదా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండవచ్చని కూడా అది తెలిపింది.
मृतकको कानको मुन्द्रा चोरी गर्ने व्यक्तिहरु नियन्त्रणमा लिएको सम्बन्धमा । pic.twitter.com/pnPlnQPn9j
— Nepal Police (@NepalPoliceHQ) August 27, 2026


