ఎంపిక చేసిన పీఎంఎల్–ఎన్ చీఫ్ నవాజ్ షరీఫ్
లాహోర్: ఆక్రమిత కశ్మీర్(పీవోకే) ప్రధానమంత్రి పదవికి ఇఫ్తికార్ జిలానీని పాకిస్తాన్ అధికార పార్టీ పీఎంఎల్(ఎన్) అధిపతి నవాజ్ షరీఫ్ ఎంపిక చేశారు. తీవ్ర ఘర్షణలు, రిగ్గింగ్ ఆరోపణల మధ్య పీవోకే అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో అత్యధిక సీట్లను పీఎంఎల్(ఎన్)గెల్చుకుంది.
ఈ ఎన్నికల్లో ముజఫరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఇఫ్తికార్ జిలానీ (Iftikhar Gillani) పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. పీవోకే అసెంబ్లీలోని 53 స్థానాలకుగాను 45 సీట్లకు ప్రత్యక్ష విధానంలో, మిగతా 8 సీట్లను మహిళలు, మతపెద్దలు, నిపుణులకు కేటాయించారు. అయితే, శాంతి భద్రతల సమస్య సాకు చూపుతూ అధికారులు ఏడు సీట్లకు ఎన్నికలు జరపలేదు.
ఇఫ్తికార్ జిలానీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ నిపుణుల కోటాలో ఆయన్ను పీఎంఎల్(ఎల్) చీఫ్ నవాజ్ షరీష్ అసెంబ్లీకి నామినేట్ చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో, ప్రధాని పదవిని ఆయన చేపట్టేందుకు మార్గం సుగమమైంది. శుక్రవారం జరిగే సమావేశంలో అసెంబ్లీ ప్రధానిగా ఇఫ్తికార్‌ను ఎన్నుకునే అవకాశాలున్నాయి.
ఇదీ చదవండి: చైనాలో భారీ భూకంపం, నేపాల్ హైఅలర్ట్


