నేపాల్‌ జల ప్రళయం.. గల్లంతైనవారి జాబితా విడుదల | List Of Missing Tourists In Nepal Floods Released | Sakshi
Sakshi News home page

నేపాల్‌ జల ప్రళయం.. గల్లంతైనవారి జాబితా విడుదల

Aug 28 2026 4:22 PM | Updated on Aug 28 2026 4:43 PM

List Of Missing Tourists In Nepal Floods Released

నేపాల్‌ వరదల్లో గల్లంతైనవారి జాబితా విడుదలైంది. 33 దేశాల పర్యాటకులు గల్లంతయ్యారు. విదేశాలకు చెందిన 627 మంది పర్యాటకులు గల్లంతయ్యారు. అత్యధికంగా 290 మంది భారతీయులు గల్లంతయినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. అమెరికా-65, ఉక్రెయిన్‌-53, మలేషియా-51, ఆస్ట్రేలియా-35, బ్రిటన్‌-33, కెనడా-25, సింగపూర్‌కు చెందిన 9 మంది గల్లంతయ్యారు.

నేపాల్‌ జల విలయంలో మృతుల సంఖ్య 500 దాటింది. ఇప్పటివరకు 538 మృతదేహాలను వెలికితీశారు. 1000 మందికిపైగా గల్లంతవ్వగా.. రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతుంది. 85 మంది భారతీయులు సహా 117 మంది పర్యాటకులను నేపాల్‌ ఆర్మీ రక్షించింది.

ఉత్తరప్రదేశ్‌లోని గండక్‌ నదీప్రవాహంలో మూడు మృతదేహాలు కొట్టుకొచ్చినట్లు ఉత్తరప్రదేశ్‌ అధికారులు వెల్లడించారు. నేపాల్‌ను దాటాక వరద ప్రవాహం భారత్‌లోకే వస్తుంది. దీంతో అక్కడి నుంచే ఈ మృతదేహాలు వచ్చాయని అధికారులు భావిస్తున్నారు.

రాష్ట్రంలోని కుషీనగర్‌ జిల్లాలోని నారాయణి నదిలోనూ వరద ఉధృతి పెరిగే ఆస్కారముందని అధికారులు తెలిపారు. మరోవైపు బిహార్‌లో ఆరు జిల్లాల్లోని నదీ పరీవాహక దిగువ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మ రోవైపు ఈశా ఫౌండేషన్‌కు చెందిన డజన్ల మంది సభ్యుల జాడ గల్లంతైందని సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఆవేదన వ్యక్తంచేశారు

ఇదీ చదవండి: నేపాల్‌లో రెడ్‌ అలర్ట్‌.. మరో భారీ జల ప్రళయం ముప్పు

కాగా, మానస సరోవరం యాత్ర నుంచి విశాఖ వాసులు క్షేమంగా తిరిగొచ్చారు. విశాఖపట్నం నుంచి మానస సరోవరం యాత్రకు 10 మంది పర్యాటకులు వెళ్లారు. ఆగస్టు 11వ తేదీన  విశాఖపట్నం నుంచి మానస సరోవరం యాత్రకు వెళ్లారు. 23వ తేదీన తిమోర్ చైనా ఇమ్మిగ్రేషన్ సెంటర్‌కు యాత్రికులు వెళ్లగా.. 26న వరద బీభత్సంలో చైనా ఇమ్మిగ్రేషన్ సెంటర్ కొట్టుకుపోయింది. వరద ప్రమాదానికి ఒకరోజు ముందే ఖాట్మండు ఎయిర్‌పోర్టు నుంచి విశాఖపట్నం పర్యాటకులు ఢిల్లీ చేరుకున్నారు. ఇతర బృందాల్లో పలువురు వరదల్లో గల్లంతయ్యారు. ఇషా ఫౌండేషన్‌​​కు చెందిన కొందరు బృందం సైతం గల్లంతయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement