‘ఏపీలో గనుల దోపిడీ.. పెనాల్టీలో ఉన్న మైన్స్‌ ఓపెన్‌’ | YSRCP ANil Kumar Yadav Serious Comments ON CBN Govt | Sakshi
Sakshi News home page

‘ఏపీలో గనుల దోపిడీ.. పెనాల్టీలో ఉన్న మైన్స్‌ ఓపెన్‌’

May 4 2025 12:37 PM | Updated on May 4 2025 1:22 PM

YSRCP ANil Kumar Yadav Serious Comments ON CBN Govt

సాక్షి, నెల్లూరు: ఏపీలో కూటమి సర్కార్‌ పాలనలో పెనాల్టీ ఉన్న మైన్స్‌ తెరిచి మైనింగ్‌ చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌. క్వార్జ్‌ అక్రమాలపై వేమిరెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. వందల మైన్స్ ఉంటే కేవలం 30 మైన్స్ మాత్రమే ఎందుకు ఓపెన్ చేశారని ప్రశ్నించారు.

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ..‘కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇన్ని రోజులు మీడియాకి దూరంగా ఉండాల్సి వచ్చింది. క్వార్జ్ దందాను నడిపి అనిల్ వేల కోట్లు సంపాదించడానికి అసత్య ప్రచారాలు చేశారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కు అందరికి ఉంటుంది.. మాజీ మంత్రి కాకాణికి న్యాయస్థానం మీద గౌరవం ఉంది. గత ప్రభుత్వమే కొన్ని మైన్స్ మీద 255 కోట్ల రూపాయల మేర ఫైన్ విధించింది. వాటిని వసూలు చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీదే ఉంది.

పెనాల్టీ ఉన్న మైన్స్ ఓపెన్ చేసి మైనింగ్ చేస్తున్నారు. వందల మైన్స్ ఉంటే కేవలం 30 మైన్స్ మాత్రమే ఎందుకు ఓపెన్ చేశారు?. గత ప్రభుత్వంలో 150 కోట్ల దాకా ప్రభుత్వానికి ఆదాయం వస్తే ఇప్పుడు 30 కోట్లు కూడా రావడం లేదు. 100 మైన్స్ దాకా మూసేశారు. ఈ ప్రభుత్వంలో మైన్ మీద ఆధారపడిన కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయ్. వైఎస్సార్‌సీపీ హయాంలో మేము ఎవరిని బెదిరించలేదు.. ఇప్పుడు మైన్ ఓనర్స్ ని బెదిరించి.. గనులు మూయించారు. ఓనర్స్ కోర్టుకు వెళ్లారు.

వేమిరెడ్డే సూత్రధారి..
క్వార్జ్‌ని నమ్ముకున్న కూలీలు, సామాన్య ప్రజలు నష్టపోతున్నారు. సామాన్య ప్రజల కోసం అవసరమైతే కొట్లాడతా.. కాకాణి మీద కేసు పెట్టునట్లు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద కూడా కేసు నమోదు చెయ్యాలి. క్వార్జ్ అక్రమాలపై వీపీఆర్‌ సమాధానం చెప్పాలి.. పెద్ద మనిషి ముసుగులో ఆయన చేసిన అక్రమాలు బయటికి తీసుకొస్తాం. ఎవరి హయాంలో అక్రమ మైనింగ్ జరిగిందో చూడండి. కొండలు కొండలు గ్రావెల్.. ఇసుకను తీసుకెళుతున్నారు. గత ప్రభుత్వంలో ఏరోజు కూడా గనుల యజమానులు కోర్టుకు వెళ్ళలేదు. న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం అమలు చేయలేదు. గనుల యజమానుల సంఘం కూడా ప్రభుత్వానికి లేఖ రాసింది. మందకృష్ణ మాదిగకు చెందిన ఎంఆర్‌పీఎస్‌ నేతలు కూడా గనులను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు

లక్ష్మి క్వార్జ్‌ అండ్ సాండ్  కంపెనీలో VPR డైరెక్టర్ గా వున్నారు. ఈ కంపెనీనే తెల్లరాయిని ఎగుమతి చేసింది. తరువాత ఫినీ క్వార్జ్‌ లిమిటెడ్ పేరుతో సిస్టర్ కంపెనీను ప్రారంభించారు. దీని డైరెక్టర్ విజయకుమార్ రెడ్డి, ఆయన ఎవరో అందరికీ తెలుసు. ఈ కంపెనీ ద్వారా కూడా తెల్లరాయిని ఎగుమతి చేశారు. నేను ఏ ఒక్క గని యజమానిని కూడా బెదిరించలేదు. ఇప్పుడు వీళ్లే గనుల యజమానులను బెదిరించి వారి నుంచి మెటీరియల్ ను తీసుకుంటున్నారు. ఈ తెల్లరాయిని తీసుకువెళ్లేందుకు అనుమతులు ఇవ్వకపోయినా.. ఇచ్చినట్లు తహసిల్దార్ చెబుతున్నారు

అక్రమ మైనింగ్‌..
గని కాల పరిమితి ముగిసిన తర్వాత అవి ప్రభుత్వ ఆధీనంలోకి వస్తాయి. కానీ ఇలాంటి గనులన్నింటినీ స్వాధీనం చేసుకొని అక్రమ మైనింగ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూమిలో అక్రమ మైనింగ్ చేస్తుంటే కేసులు కట్టడం లేదు. రెండు రోజుల క్రితం కూడా టిప్పర్లతో తెల్లరాయి ని తీసుకు వెళుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కొత్త విధానం ప్రకారం గనుల వద్ద ఉన్న తెల్లరాయి నిల్వలను వేలం వేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం వేలం వేస్తే రూ.500 కోట్ల దాకా ఆదాయం వస్తుంది. కొన్ని గనులను అమర్ నాథ్ రెడ్డి నిర్వహిస్తున్నారు, వీటిని పరిశీలించేందుకు ఎవరినీ అనుమతించడం లేదు. గనుల వద్ద గూండాలను పెట్టారు,. అక్రమ మైనింగ్ లో భాగంగా పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ చేస్తున్నారు.. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. వీటన్నిటికీ ఎంపీ వేమిరెడ్డి సమాధానం చెప్పాలి, వేమిరెడ్డి తన అనుచరుల వద్ద మాట్లాడించకుండా తానే మాట్లాడాలి. గన్నులన్నింటినీ ప్రారంభించక పోతే యజమానుల తరఫున ఉద్యమం చేస్తా, గనుల్లో అక్రమాలు చేస్తున్న ఎంపీ వేమిరెడ్డిపై ఎందుకు కేసు పెట్టకూడదని ప్రశ్నిస్తున్నా.

తన కంపెనీ  కాకపోతే  ఆయన ఎందుకు చెప్పడం లేదు?. రూ.15 వందల కోట్ల మేర ఎంపీ దోపిడీకి పాల్పడ్డారు. గతంలోనే చెప్పా.. పే బ్యాక్స్ అందరికీ ఉంటాయి, క్వార్జ్‌ డంప్‌ను వేలం వేయాలని డిమాండ్ చేస్తున్నా. ఇలాగే అక్రమంగా మైనింగ్ కొనసాగిస్తే అందరికీ అవకాశం కల్పించాలి, బడా బాబులకు మాత్రమే అవకాశం ఇవ్వడం మంచిది కాదు. చేస్తే అందరికీ అవకాశం ఇవ్వాలి.. లేకుంటే ఆందోళన చేస్తాం. గనుల్లో 70 శాతం మంది బాధితులు టీడీపీ వాళ్లే ఉన్నారు.  సైదాపురంలో గంజాయి బ్యాచ్ తిరుగుతూ.. ప్రజలను, మహిళలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. మా పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణిపై తప్పుడు కేసులు పెట్టారు’ అని చెప్పుకొచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement