Quartz
-
‘ఏపీలో గనుల దోపిడీ.. పెనాల్టీలో ఉన్న మైన్స్ ఓపెన్’
సాక్షి, నెల్లూరు: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో పెనాల్టీ ఉన్న మైన్స్ తెరిచి మైనింగ్ చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. క్వార్జ్ అక్రమాలపై వేమిరెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వందల మైన్స్ ఉంటే కేవలం 30 మైన్స్ మాత్రమే ఎందుకు ఓపెన్ చేశారని ప్రశ్నించారు.మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ..‘కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇన్ని రోజులు మీడియాకి దూరంగా ఉండాల్సి వచ్చింది. క్వార్జ్ దందాను నడిపి అనిల్ వేల కోట్లు సంపాదించడానికి అసత్య ప్రచారాలు చేశారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కు అందరికి ఉంటుంది.. మాజీ మంత్రి కాకాణికి న్యాయస్థానం మీద గౌరవం ఉంది. గత ప్రభుత్వమే కొన్ని మైన్స్ మీద 255 కోట్ల రూపాయల మేర ఫైన్ విధించింది. వాటిని వసూలు చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీదే ఉంది.పెనాల్టీ ఉన్న మైన్స్ ఓపెన్ చేసి మైనింగ్ చేస్తున్నారు. వందల మైన్స్ ఉంటే కేవలం 30 మైన్స్ మాత్రమే ఎందుకు ఓపెన్ చేశారు?. గత ప్రభుత్వంలో 150 కోట్ల దాకా ప్రభుత్వానికి ఆదాయం వస్తే ఇప్పుడు 30 కోట్లు కూడా రావడం లేదు. 100 మైన్స్ దాకా మూసేశారు. ఈ ప్రభుత్వంలో మైన్ మీద ఆధారపడిన కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయ్. వైఎస్సార్సీపీ హయాంలో మేము ఎవరిని బెదిరించలేదు.. ఇప్పుడు మైన్ ఓనర్స్ ని బెదిరించి.. గనులు మూయించారు. ఓనర్స్ కోర్టుకు వెళ్లారు.వేమిరెడ్డే సూత్రధారి..క్వార్జ్‌ని నమ్ముకున్న కూలీలు, సామాన్య ప్రజలు నష్టపోతున్నారు. సామాన్య ప్రజల కోసం అవసరమైతే కొట్లాడతా.. కాకాణి మీద కేసు పెట్టునట్లు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద కూడా కేసు నమోదు చెయ్యాలి. క్వార్జ్ అక్రమాలపై వీపీఆర్ సమాధానం చెప్పాలి.. పెద్ద మనిషి ముసుగులో ఆయన చేసిన అక్రమాలు బయటికి తీసుకొస్తాం. ఎవరి హయాంలో అక్రమ మైనింగ్ జరిగిందో చూడండి. కొండలు కొండలు గ్రావెల్.. ఇసుకను తీసుకెళుతున్నారు. గత ప్రభుత్వంలో ఏరోజు కూడా గనుల యజమానులు కోర్టుకు వెళ్ళలేదు. న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం అమలు చేయలేదు. గనుల యజమానుల సంఘం కూడా ప్రభుత్వానికి లేఖ రాసింది. మందకృష్ణ మాదిగకు చెందిన ఎంఆర్పీఎస్ నేతలు కూడా గనులను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారులక్ష్మి క్వార్జ్ అండ్ సాండ్ కంపెనీలో VPR డైరెక్టర్ గా వున్నారు. ఈ కంపెనీనే తెల్లరాయిని ఎగుమతి చేసింది. తరువాత ఫినీ క్వార్జ్ లిమిటెడ్ పేరుతో సిస్టర్ కంపెనీను ప్రారంభించారు. దీని డైరెక్టర్ విజయకుమార్ రెడ్డి, ఆయన ఎవరో అందరికీ తెలుసు. ఈ కంపెనీ ద్వారా కూడా తెల్లరాయిని ఎగుమతి చేశారు. నేను ఏ ఒక్క గని యజమానిని కూడా బెదిరించలేదు. ఇప్పుడు వీళ్లే గనుల యజమానులను బెదిరించి వారి నుంచి మెటీరియల్ ను తీసుకుంటున్నారు. ఈ తెల్లరాయిని తీసుకువెళ్లేందుకు అనుమతులు ఇవ్వకపోయినా.. ఇచ్చినట్లు తహసిల్దార్ చెబుతున్నారుఅక్రమ మైనింగ్..గని కాల పరిమితి ముగిసిన తర్వాత అవి ప్రభుత్వ ఆధీనంలోకి వస్తాయి. కానీ ఇలాంటి గనులన్నింటినీ స్వాధీనం చేసుకొని అక్రమ మైనింగ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూమిలో అక్రమ మైనింగ్ చేస్తుంటే కేసులు కట్టడం లేదు. రెండు రోజుల క్రితం కూడా టిప్పర్లతో తెల్లరాయి ని తీసుకు వెళుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కొత్త విధానం ప్రకారం గనుల వద్ద ఉన్న తెల్లరాయి నిల్వలను వేలం వేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం వేలం వేస్తే రూ.500 కోట్ల దాకా ఆదాయం వస్తుంది. కొన్ని గనులను అమర్ నాథ్ రెడ్డి నిర్వహిస్తున్నారు, వీటిని పరిశీలించేందుకు ఎవరినీ అనుమతించడం లేదు. గనుల వద్ద గూండాలను పెట్టారు,. అక్రమ మైనింగ్ లో భాగంగా పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ చేస్తున్నారు.. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. వీటన్నిటికీ ఎంపీ వేమిరెడ్డి సమాధానం చెప్పాలి, వేమిరెడ్డి తన అనుచరుల వద్ద మాట్లాడించకుండా తానే మాట్లాడాలి. గన్నులన్నింటినీ ప్రారంభించక పోతే యజమానుల తరఫున ఉద్యమం చేస్తా, గనుల్లో అక్రమాలు చేస్తున్న ఎంపీ వేమిరెడ్డిపై ఎందుకు కేసు పెట్టకూడదని ప్రశ్నిస్తున్నా.తన కంపెనీ కాకపోతే ఆయన ఎందుకు చెప్పడం లేదు?. రూ.15 వందల కోట్ల మేర ఎంపీ దోపిడీకి పాల్పడ్డారు. గతంలోనే చెప్పా.. పే బ్యాక్స్ అందరికీ ఉంటాయి, క్వార్జ్ డంప్‌ను వేలం వేయాలని డిమాండ్ చేస్తున్నా. ఇలాగే అక్రమంగా మైనింగ్ కొనసాగిస్తే అందరికీ అవకాశం కల్పించాలి, బడా బాబులకు మాత్రమే అవకాశం ఇవ్వడం మంచిది కాదు. చేస్తే అందరికీ అవకాశం ఇవ్వాలి.. లేకుంటే ఆందోళన చేస్తాం. గనుల్లో 70 శాతం మంది బాధితులు టీడీపీ వాళ్లే ఉన్నారు. సైదాపురంలో గంజాయి బ్యాచ్ తిరుగుతూ.. ప్రజలను, మహిళలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. మా పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణిపై తప్పుడు కేసులు పెట్టారు’ అని చెప్పుకొచ్చారు. -
గనులే ఆ ఊరికి శాపం.. మైలారం మాయమయ్యే ముప్పు!
సాక్షి, నాగర్‌కర్నూల్: చుట్టూ నల్లమల (Nallamala) అటవీప్రాంతం.. కొండలు, గుట్టల నడుమ పచ్చని పొలాలతో అలరారుతున్న ఆ ఊరికి గనులు శాపంగా పరిణమించాయి. గ్రామానికి ఆనుకునే ఉన్న గుట్టపై క్వార్ట్జ్ కోసం సాగుతున్న మైనింగ్ (Mining) తవ్వకాలు ఏకంగా ఆ ఊరినే ఉనికి లేకుండా చేస్తాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. బ్లాస్టింగ్లతో ఇళ్లు, గ్రామానికి ముప్పు ఉందని, మైనింగ్ అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులంతా పోరాటానికి దిగుతున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలం మైలారం(mailaram) గ్రామానికి ఆనుకుని ఉన్న గుట్టపై జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాలపై ఊరంతా పోరాడుతోంది. మైనింగ్ అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏకంగా గత పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించారు కూడా. ఇటీవల గ్రామస్తులు రిలే నిరాహార దీక్షకు దిగగా, అనుమతి లేదంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామంలో మైనింగ్ అనుమతులు రద్దు చేసేవరకు పోరాటం చేస్తామని గ్రామస్తులు కంకణం కట్టుకున్నారు.200 మీటర్ల దూరంలో ఉన్న ఇళ్లకు ముప్పు మైలారం గ్రామానికి ఆనుకుని ఉన్న గుట్టపై క్వార్ట్జ్, ఫెల్స్పార్ ఖనిజ తవ్వకాలకు మైనింగ్ శాఖ 2017లో అనుమతులు జారీ చేసింది. గుట్టపై సర్వే నంబరు 120/1లో 24.28 హెక్టార్ల మేర తవ్వకాలు జరిపేందుకు అవకాశం కల్పించింది. అయితే మైనింగ్ జరిగే ప్రాంతానికి 200 మీటర్ల సమీపంలోనే ఇళ్లు ఉండటంతో స్థానికుల్లో ఆందోళన రేగుతోంది. గ్రామంలో సుమారు 540 కుటుంబాలు, 1,850 మంది వరకు జనాభా ఉంది. వీరిలో కొన్ని కుటుంబాలు ఏళ్లుగా గుట్టకు ఆనుకునే ఇళ్లను నిర్మించుకుని జీవిస్తున్నారు. గుట్టపై పురాతన నరసింహస్వామి, శివాలయాలు సైతం ఉన్నాయి. మైనింగ్ కోసం జరుపుతున్న పేలుళ్లతో సమీపంలోని ఇళ్లలో ఉంటున్నవారు భయభ్రాంతులకు లోనవుతున్నారు. మైనింగ్ అనుమతులను తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సర్వే నంబరు 120/1లో 24.28 హెక్టార్ల మేర తవ్వకాలు జరిపేందుకు అవకాశం కల్పించింది. అయితే మైనింగ్ జరిగే ప్రాంతానికి 200 మీటర్ల సమీపంలోనే ఇళ్లు ఉండటంతో స్థానికుల్లో ఆందోళన రేగుతోంది. గ్రామంలో సుమారు 540 కుటుంబాలు, 1,850 మంది వరకు జనాభా ఉంది. వీరిలో కొన్ని కుటుంబాలు ఏళ్లుగా గుట్టకు ఆనుకునే ఇళ్లను నిర్మించుకుని జీవిస్తున్నారు. గుట్టపై పురాతన నరసింహస్వామి, శివాలయాలు సైతం ఉన్నాయి. మైనింగ్ కోసం జరుపుతున్న పేలుళ్లతో సమీపంలోని ఇళ్లలో ఉంటున్నవారు భయభ్రాంతులకు లోనవుతున్నారు. మైనింగ్ అనుమతులను తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఫోర్జరీ సంతకాలతో గ్రామసభ తీర్మానం గ్రామ పంచాయతీ పరిధిలో మైనింగ్ తవ్వకాల కోసం గ్రామసభ తీర్మానం కీలకం కాగా, ఈ విషయం గ్రామస్తులకే తెలియకపోవడం గమనార్హం. సమాచార హక్కు చట్టం ద్వారా గ్రామసభ తీర్మానం కాపీ వెలుగులోకి వచ్చింది. తీర్మానంలో గ్రామస్తులకు తెలియకుండానే పాలకవర్గం, కొందరు గ్రామస్తుల పేరుతో సంతకాలను ఫోర్జరీ చేసినట్టు గ్రామస్తులు గుర్తించారు. దీనిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో మైనింగ్ కోసం అనుమతులు ఉన్నాయని, గ్రామస్తుల ఫిర్యాదు నేపథ్యంలో మరోసారి సమీక్షిస్తామని జిల్లా మైనింగ్ అధికారి రవీందర్ తెలిపారు. చదవండి: చరిత్రకు సాజీవ సాక్ష్యం రాజకోటమా ఊరే లేకుండా పోతుంది.. మా ఇళ్ల పక్కనే బ్లాస్టింగ్ చేస్తుంటే మేం ఎక్కడికి పోవాలి? మైనింగ్‌తో మా ఊరే లేకుండా పోతుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు మైనింగ్ నిర్వాహకులకే అండగా ఉంటున్నారు. మా బాధ ఎవరికీ పట్టడం లేదు. మైనింగ్ ఆపకపోతే మేమంతా నిరాహార దీక్ష చేసైనా ఊరిని కాపాడుకుంటాం. – గాయత్రి, మైలారం -
వేమిరెడ్డికే క్వార్ట్జ్ గనులు!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సైదాపురం క్వార్ట్జ్ గనులపై ఎమ్మెల్యేలు, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మధ్య నెలకొన్న ఆధిపత్య పోరులో ఎంపీదే పైచేయిగా మారినట్లు సమాచారం. గనులను చేజిక్కించుకునేందుకు జిల్లాకు చెందిన ఇతర ఎమ్మెల్యేలు చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. ఎంపీ వేమిరెడ్డికి ప్రభుత్వ ‘ముఖ్య’ నేత గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జనవరి నుంచి ఇక అధికారికంగానే గనుల దోపిడీ జరగనుంది. నాణ్యమైన గనులు ఉన్న వెంకటగిరి, సర్వేపల్లి, ఉదయగిరి నియోజకవర్గాల్లో దొరికే క్వార్ట్జ్ మెటల్‌ను ఆయనకే అప్పగించాలని ప్రభుత్వ పెద్దల నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు నజరానాగా ప్రతి నెలా ‘ముఖ్య’ నేతకు ముడుపులు చెల్లించేలా ఒప్పందం జరిగినట్లు సమాచారం. ఇప్పటికే సైదాపురం పరిసర ప్రాంతాల నుంచి గత నెల రోజులుగా నిత్యం వందల లారీల్లో ఖనిజాన్ని అనధికారికంగా పెద్ద ఎత్తున తరలిస్తున్నారు.తమకు ముడిసరుకు మొత్తం అప్పగించాలని లేదంటే కేసులు బనాయించి లీజులు రద్దు చేయిస్తామని అన్ని అనుమతులున్న ఇతర గనుల యజమానులను బెదిరిస్తున్నారు. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ గత ఆర్నెళ్లుగా గనుల యజమానులు తవ్వకాలు చేపట్టకుండా అడ్డుకుంటున్నారు. లీగల్ మైన్లను దుర్మార్గంగా నిలిపివేయడంపై గనుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమ అనుకూల అధికారులను నియమించుకోవడంతోపాటు సైదాపురంలో ఎంపీ వేమిరెడ్డి కార్యాలయం ఏర్పాటుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. సైదాపురం కేంద్రంగా ఇకపై అక్కడి నుంచే తన వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుగా వేమిరెడ్డి అన్ని వసతులు ఏర్పాటు చేసుకుంటున్నారు. గనుల తవ్వకాలపై ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా సైదాపురం పరిసరాల్లో క్వార్ట్జ్ శుద్ధి పరిశ్రమ ఏర్పాటు పేరుతో జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. ఉపాధి దొరుకుతుందంటూ కంపెనీ ముసుగులో ప్రజలను మభ్యపుచ్చి కొన్నాళ్ల పాటు హడావుడి చేసి అనంతరం అందరి నుంచి గనులను లాక్కునే ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది.గనుల యజమానులకు బెదిరింపులు.. జిల్లాలో మైనింగ్ దందాను చేజిక్కించుకున్న వేమిరెడ్డి అనుచరులు అధికారికంగా అన్ని అనుమతులున్న గనులు యజమానులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. అధికారిక గనుల్లో ఉన్న ముడిసరుకును సైతం తమకే ఇవ్వాలని, తాము చెప్పిన ధరకే అప్పగించాలని బెదిరింపులకు దిగారు. ఇప్పటికే తవ్విన ఖనిజంతోపాటు ఇకపై వెలికితీసేది కూడా తాము చెప్పిన నామ మాత్రపు ధరకే ఇవ్వాలని ఆదేశించారు. ఈ క్రమంలో గనుల యజమానులను హైదరాబాద్‌లోని తన కార్యాలయానికి పిలిపించుకుని ఎంపీ తీవ్ర స్థాయిలో హెచ్చరించినట్లు సమాచారం. ముడిసరుకు ఇవ్వకుంటే గనుల నుంచి మీ లారీలు వెళ్లలేవని, పలు రకాల కేసులు నమోదు చేయించి లీజులు రద్దు చేయిస్తామంటూ తమను బెదిరించినట్లు ఓ గని యజమాని వాపోయాడు. తమ మైన్లకు అన్ని అనుమతులు ఉన్నాయని, గత 50 ఏళ్లుగా ‘డెడ్ రెంట్’ సైతం చెల్లిస్తున్నామని పేర్కొన్నాడు.రూప్ కుమార్ ద్వారా..ఎంపీ వేమిరెడ్డి తన అనుచరుడైన రూప్‌కుమార్‌ను ముందుపెట్టి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. సైదాపురం సమీపంలోని శ్రీనివాస పద్మావతి, చాగణం సమీపంలో ఉన్న సిద్ధి వినాయక, తుమ్మలతలుపూరులో ఉన్న జయలక్ష్మి కనకదుర్గా, కలిచేడు సమీపంలో ఉన్న రాఘవేంద్ర గనులు ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఆర్నెళ్లుగా అందరి మైన్లు నిలిపివేసి కేవలం ఎంపీ అనుచరుడికి చెందిన నాలుగు గనులకే అనుమతులు ఇవ్వడం వెనుక మతలబు ఏమిటనేది తెలిసిపోతోంది.అనుకూల అధికారి రాకనెల్లూరు జిల్లా మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా తిరుపతి జిల్లా డీడీ బాలాజీ నాయక్‌కు అదనపు బాధ్యతలు అప్పగించేలా ఎంపీ చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. గతంలో ఇక్కడ పనిచేసిన చంద్రశేఖర్‌ను కలెక్టర్ ద్వారా 20 రోజుల క్రితం ప్రభుత్వానికి సరెండర్ చేశారు. అయితే దీన్ని న్యాయస్థానం తప్పుబట్టడంతో మళ్లీ పోస్టింగ్ ఇచ్చినట్లే ఇచ్చి విజయవాడకు బదిలీ చేశారు. అనంతరం ఆ పోస్టులో తమ అనుకూల అధికారిని నియమించేలా బుధవారం ఉత్తర్వులు జారీ చేయించారు.విదేశాల్లో భారీ గిరాకీ..కూటమి ప్రభుత్వం రాగానే సైదాపురం క్వారŠట్జ్ గనులపై ‘ముఖ్య’ నేత కన్ను పడటంతో వెంటనే అనుమతులు నిలిపివేశారు. అన్ని అనుమతులతో వందేళ్ల లీజుపై తీసుకున్న గనులను సైతం మూసి వేయించారు. ఇక్కడ లభ్యమయ్యే మైకా క్వార్‌ట్టŠజ్, తెల్లరాయి క్వార్‌ట్టŠజ్‌పై నివేదిక తెప్పించుకున్నారు. వందేళ్లకు సరిపడా గనుల్లో నిల్వలున్నట్లు గుర్తించడంతో వాటిని తవ్వి సొమ్ము చేసుకునేందుకు పథకం వేశారు. సైదాపురం మండలంలో లభించే ఖనిజాన్ని చైనా, జపాన్, రష్యాకు ఎగుమతి చేస్తుంటారు. ఎనిమిది నెలలుగా మైకా, క్వార్ట్ ్జకి విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. నాణ్యతను బట్టి ముడి ఖనిజం టన్ను రూ.25 వేల నుంచి రూ.రెండు లక్షల వరకు పలుకుతోంది. చైనాలోని సెమీకండక్టర్ పరిశ్రమల్లో మైకా క్వార్ట్ ్జని ఎక్కువగా వినియోగిస్తున్నారు. -
ఉదయగిరి కొండల్లో బంగారు, రాగి నిక్షేపాలు
సాక్షి, ఉదయగిరి (నెల్లూరు): మండలంలోని మాసాయిపేట కొండపై బంగారు, రాగి, వైట్ క్వార్ట్›్జ నిక్షేపాలు వెలుగులో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం అన్వేషణ సాగించి గుర్తించి ముమ్మరంగా డ్రిల్లింగ్ పనులు చేపట్టింది. కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మ్యాపింగ్ నిర్వహించి కొండలో ఎంత మేర ఖనిజ నిక్షేపాలు ఉన్నాయో తెలుసుకునేందుకు కొంత కాలంగా డ్రిల్లింగ్ పనులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కొండపై ఐదు ప్రాంతాల్లో 500 నుంచి 1000 అడుగుల మేర డ్రిల్లింగ్ నిర్వహించి 46 నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు అందజేశారు. ఈ ప్రాంతంలో సుమారు రెండు వేల హెక్టార్లకు పైగా భూముల్లో బంగారు, రాగి, వైట్‌క్వార్‌ట్ట్జ నిక్షేపాలున్నట్లు గుర్తించింది. సోమవారం హైదరాబాద్ నుంచి అధికారుల బృందంతో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాహనంతో డ్రిల్లింగ్ చేసే ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు. 150 మీటర్ల మేర డ్రిల్లింగ్ వేసిన ప్రాంతంలో భూగర్భంలోకి సీసీ కెమెరాలు పంపి సేకరిస్తున్నారు. ఖనిజ నిక్షేపాలతోనైనా ఉదయగిరి మెట్ట ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఈ ప్రాంత వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: (శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తిరస్తు.. జూన్ దాటితే మళ్లీ డిసెంబరే) -
12 క్వార్ట్జ్ , బెరైటీస్ గనుల లీజు రద్దు
ఒంగోలు సబర్బన్ : జిల్లాలోని 12 క్వార్ట్జ్ , బెరైటీస్ గనుల లీజులను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో గనులు విస్తారంగా ఉన్నాయి. గనులు, భూగర్భవనరులశాఖ నుంచి అనుమతి పొందిన ఈ లీజుదారులు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించటంతో లీజులను రద్దు చేస్తున్నట్లు ఆయన తన ఉత్తర్వుల్లో పేర్కోన్నారు. పలుమార్లు నోటీసులు జారీ చేసినా యజమానుల్లో స్పందన కరువవ్వటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఒక్కో లీజుకు 25 ఏళ్ల కాలపరిమితితో గతంలో అనుమతించారు. సీఎస్ పురం మండలం చినపనాయుడుపల్లిలో 53.93 ఎకరాలకు ఇచ్చిన క్వార్ట్జ్ లీజును రద్దు చేశారు. అదే మండలం మూసునూరులో యూ.మల్లికార్జున రావు కు 38.29 ఎకరాల్లో క్వార్ట్జ్ లీజును కూడా రద్దు చేశారు. పెద్దారవీడు మండలం చెట్లమిట్ట పంచాయతీ పరిధిలోని రాజంపల్లిలో కృష్ణమినరల్స్కు ఇచ్చిన 11.563 హెక్టార్లు క్వార్ట్జ్ లీజును కూడా రద్దు చేశారు. కొనకనమిట్ల మండలం వింజావతిపాడులో పి.సుబ్బారావుకు ఇచ్చిన 9.226 హెక్టార్ల క్వార్ట్జ్లీజును రద్దు చేశారు. అదే మండలం సిద్ధవరం గ్రామంలోని ఆర్.మురళీధరరెడ్డికి ఇచ్చిన 43.769 హెక్టార్లలోని క్వార్ట్జ్లీజును రద్దు చేశారు. పామూరు మండలం సిద్ధవరం పరిధిలోని చంద్రకాంత్ మైన్స్ అండ్ మినరల్స్ 27.409 హెక్టార్లలో ఇచ్చిన క్వార్ట్జ్ లీజును రద్దు చేశారు. కొనకనమిట్ల మండలం ఇరసలగుండం పరిధిలోని 21.243 హెక్టార్లను ఎస్కే నాగూర్‌వలికి ఇచ్చిన క్వార్ట్జ్ లీజును కూడా రద్దు చేశారు. వలేటివారిపాలెం మండలం పోలినేనిచెరువులో 21.514 హెక్టార్లలో యూబీ మినరల్స్ మేనేజింగ్ పార్టనర్ పి.ఉదయభాస్కరరావుకు ఇచ్చిన క్వార్ట్జ్ లీజును రద్దు చేశారు. అదేవిధంగా కొమరోలు మండలం మొట్టుపల్లి గ్రామంలోని 4.914 హెక్టార్లలో బెరైటీస్ గనుల లీజు పొందిన బి.సుధాకర్‌కు చెందిన లీజును కూడా రద్దు చేస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ అత్యవసర ఉత్తర్వులు జారీ చేశారు.