ఉదయగిరి కొండల్లో బంగారు, రాగి నిక్షేపాలు

Geological Survey of India Search for Gold and Copper Ore Udayagiri  - Sakshi

నిక్షేపాలున్నట్లు గుర్తించిన కేంద్రం   

సాక్షి, ఉదయగిరి (నెల్లూరు): మండలంలోని మాసాయిపేట కొండపై బంగారు, రాగి, వైట్‌ క్వార్ట్‌›్జ నిక్షేపాలు వెలుగులో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం అన్వేషణ సాగించి గుర్తించి ముమ్మరంగా డ్రిల్లింగ్‌ పనులు చేపట్టింది. కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మ్యాపింగ్‌ నిర్వహించి కొండలో ఎంత మేర ఖనిజ నిక్షేపాలు ఉన్నాయో తెలుసుకునేందుకు కొంత కాలంగా డ్రిల్లింగ్‌ పనులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా కొండపై ఐదు ప్రాంతాల్లో 500 నుంచి 1000 అడుగుల మేర డ్రిల్లింగ్‌ నిర్వహించి 46 నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు అందజేశారు.

ఈ ప్రాంతంలో సుమారు రెండు వేల హెక్టార్లకు పైగా భూముల్లో బంగారు, రాగి, వైట్‌క్వార్‌ట్ట్జ నిక్షేపాలున్నట్లు గుర్తించింది. సోమవారం హైదరాబాద్‌ నుంచి అధికారుల బృందంతో జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా వాహనంతో డ్రిల్లింగ్‌ చేసే ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు. 150 మీటర్ల మేర డ్రిల్లింగ్‌ వేసిన ప్రాంతంలో భూగర్భంలోకి సీసీ కెమెరాలు పంపి సేకరిస్తున్నారు. ఖనిజ నిక్షేపాలతోనైనా ఉదయగిరి మెట్ట ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఈ ప్రాంత వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  

చదవండి: (శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తిరస్తు.. జూన్‌ దాటితే మళ్లీ డిసెంబరే) 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top