దొరికినంత దోచెయ్‌.. నా ‘సోమి’రంగా! | Quartz mining in three places in Degapudi Nellore district | Sakshi
Sakshi News home page

దొరికినంత దోచెయ్‌.. నా ‘సోమి’రంగా!

Jun 26 2025 5:54 AM | Updated on Jun 26 2025 5:54 AM

Quartz mining in three places in Degapudi Nellore district

టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి దురాగతం  

నెల్లూరు జిల్లా డేగపూడిలో మూడుచోట్ల  క్వార్ట్జ్‌ తవ్వకాలు 

ఖనిజ సంపద దోపిడీకి సహకరిస్తున్న అధికారులు 

ఓ వ్యాపారి ద్వారా చైనాకు 5 వేల టన్నుల ఎగుమతి 

టన్ను రూ.2 లక్షల వరకు విక్రయం 

దోపిడీని అడ్డుకుంటున్నారని కాకాణిని జైల్లో పెట్టించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి 

సాక్షి, టాస్క్‌పోర్స్‌: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో ఖనిజ సంపద దోపిడీకి అడ్డు లేకుండా పోతోంది. పొదలకూరు మండలం డేగపూడిలోని ప్రభుత్వ పోరంబోకు భూముల్లో  ఖరీదైన మైకా  క్వార్ట్జ్, ఫల్సపర్‌ మెటల్‌ను తవ్వకాలు చేస్తూ అక్రమంగా తరిలిస్తున్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సహకారంతో ఆయన అనుచరులు అక్రమ దందా సాగిస్తున్నారు. 

సైదాపురంతోపాటు పొదలకూరు మండలం డేగపూడిలో లభించే క్వార్ట్జ్‌ ఖనిజానికి చైనాలో మంచి డిమాండ్‌ ఉంది. దీంతో సైదాపురానికి చెందిన ఓ వ్యాపారి ద్వారా డేగపూడి క్వార్ట్జ్‌ను సోమిరెడ్డి అనుచరులు అక్రమ తవ్వకాలు చేసి సైదాపురంలో అనుమతులు ఉన్న మైన్స్‌కు తరలిస్తున్నారు. అక్కడి నుంచి చైనాకు ఎగుమతి చేస్తున్నారు. ఈ ఖనిజానికి చైనా మార్కెట్‌లో గ్రేడును బట్టి టన్ను రూ.2 లక్షల  వరకు ధర పలుకుతోంది. రెండు నెలల్లో డేగపూడి నుంచి దాదాపు 5 వేల టన్నుల  క్వార్ట్జ్‌ అక్రమ రవాణా జరిగినట్టు తెలుస్తోంది.  

సైదాపురంతోపాటు పొదలకూరు మండలం డేగపూడిలో లభించే క్వార్ట్జ్‌ ఖనిజానికి చైనాలో మంచి డిమాండ్‌ ఉంది. దీంతో సైదాపురానికి చెందిన ఓ వ్యాపారి ద్వారా డేగపూడి క్వార్ట్జ్‌ను సోమిరెడ్డి అనుచరులు అక్రమ తవ్వకాలు చేసి సైదాపురంలో అనుమతులు ఉన్న మైన్స్‌కు తరలిస్తున్నారు. అక్కడి నుంచి చైనాకు ఎగుమతి చేస్తున్నారు. ఈ ఖనిజానికి చైనా మార్కెట్‌లో గ్రేడును బట్టి టన్ను రూ.2 లక్షల  వరకు ధర పలుకుతోంది. రెండు నెలల్లో డేగపూడి నుంచి దాదాపు 5 వేల టన్నుల  క్వార్ట్జ్‌ అక్రమ రవాణా జరిగినట్టు తెలుస్తోంది.  

కాకాణిని అక్రమ కేసులతో జైల్లో పెట్టి.. 
గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి కూటమి ప్రభుత్వ ఏర్పాటైన రోజు నుంచి సర్వేపల్లి నియోజకవర్గంలో సహజ వనరుల దోపిడీని జీపీఎస్‌ ట్రాకింగ్‌ ద్వారా వెలుగులోకి తెచ్చేవారు. ఇసుక, గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు జరిగే ప్రాంతం నుంచి లైవ్‌ ఫొటోలు తెప్పించి మీడియా ద్వారా బయటపెట్టేవారు. అటు కూటమి ప్రభుత్వ వైఫల్యాలతోపాటు ఎమ్మెల్యే సోమిరెడ్డి అవినీతి, అక్రమాలు, దోపిడీలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తుండటంతో ప్రభుత్వ పెద్దలు, స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డితో కలిసి రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేశారు.

తాటిపర్తిలో రుస్తుం మైన్స్‌లో అక్రమ మైనింగ్‌లో కాకాణి పాత్ర ఉందని, అక్కడ జిలెటిన్‌ స్టిక్స్‌ పేల్చి మైనింగ్‌ చేశారని, గిరిజనులను బెదిరించారంటూ తప్పుడు కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. అంతేకాదు మరో ఏడు అక్రమ కేసులు బనాయించి బెయిల్‌ రాకుండా అడ్డుకుంటూ సర్వేపల్లిలో అక్రమ మైనింగ్‌ చేస్తున్నారు.  

మూడు మైన్స్‌లో అక్రమ తవ్వకాలు
డేగపూడిలో కండ్లేరు ఏటి కాలువను ఆనుకుని ప్రభుత్వ పోరంబోకు భూముల్లోని మూడు ప్రాంతాల్లో అక్రమ మైనింగ్‌ చేస్తున్నారు. భారీ యంత్రాలతో రెండు నెలలుగా తవ్వకాలు చేస్తున్నారు. నిత్యం యంత్రాలతో ఖనిజాన్ని వెలికితీసి రాత్రి వేళ సైదాపురానికి రవాణా చేస్తున్నట్టు తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లో జరిగే  దోపిడీ కావడంతో స్థానికులు మిన్నకుండిపోతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తుండడంతో గ్రామస్తులు ఎదురు చెప్పలేక పోతున్నారు. 

పట్టించుకోని అధికారులు 
డేగపూడిలో కొంతకాలంగా మైకా  క్వార్ట్జ్, ఫల్సపర్‌ ఖనిజాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా దోపిడీ చేస్తున్నా జిల్లా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. మైనింగ్, విజిలెన్స్, రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్‌ అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు.  

Advertisement
 
Advertisement
Advertisement