వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శుల నియామకం | Ys Jagan Appointed Ysrcp State Secretaries | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శుల నియామకం

Oct 10 2024 8:51 PM | Updated on Oct 11 2024 8:53 AM

Ys Jagan Appointed Ysrcp State Secretaries

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారు.

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులుగా గాదె మధుసూదన్‌రెడ్డి, ఇంటూరి రాజగోపాల్‌ నియమితులయ్యారు.

కాగా, గురువారం.. రేపల్లె నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులతో వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో గర్వంగా తలెత్తుకునేలా పరిపాలన చేశామన్నారు. నేను వైఎస్సార్‌ సీపీ కార్యకర్తను అని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పుకోగలం. అన్ని పనులు ప్రజలకు చేశామన్నారు.

‘‘ప్రజలకు ఇచ్చిన మాటలను నెరవేర్చాం. బడ్జెట్‌ ప్రవేశపెట్టే సమయంలోనే సంక్షేమ క్యాలెండర్‌ను రిలీజ్‌ చేశాం. ప్రతినెలా క్రమం తప్పకుండా బటన్‌ నొక్కి పారదర్శకంగా ప్రతి ఇంటికీ లబ్ధి చేకూర్చాం. ఒక్క వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మాత్రమే ఇలా చేయగలిగింది. గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

ఇదీ చదవండి: మనం చేసిన మంచి ప్రతి ఇంట్లో ఉంది : వైఎస్‌ జగన్‌

Advertisement
 
Advertisement
Advertisement