
సాక్షి, అమరావతి : ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ట్విటర్‌లో ‘బాబుగారి 'వెన్నుపోటు' మరోసారి ఢిల్లీ స్థాయిలో మార్మోగింది. పాపం పండి పవర్‌లో లేకుండా పోయారని..త్వరలోనే రాజకీయాల నుంచి నిష్క్రమణ తప్పదని హస్తిన మాట. వెన్నుపోటు రాజకీయాలకు కాలం చెల్లిపోయింది చంద్రబాబూ..కానీ ఆంధ్ర ఔరంగజేబ్‌గా మీరు కలకాలం గుర్తుండిపోతారు.. పెద్దాయన సాక్షిగా’ అంటూ విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. చదవండి: మళ్లీ దొరికిపోయారా జూమ్ బాబు?