మళ్లీ దొరికిపోయారా జూమ్ బాబు?  | Vijayasai Reddy Satires On Chandrababu | Sakshi
Sakshi News home page

మళ్లీ దొరికిపోయారా జూమ్ బాబు? 

Aug 26 2020 8:01 PM | Updated on Aug 26 2020 8:13 PM

Vijayasai Reddy Satires On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బుధవారం ట్విటర్‌ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘‘ అమరావతిపై బాబుగోరు పెట్టిన వెబ్ పోలింగ్‌తో మరోసారి పచ్చరంగు బయటపడింది. అది 'ఎల్లో' బ్యాచ్ పోలింగ్ అని భలే కలర్ ఫుల్గా చెప్పారు. అయ్యో.. మళ్ళీ దొరికిపోయారా జూమ్ బాబు ? అన్నట్టు.. ఆ వెబ్ సైట్‌ని క్రాష్ చేశారెందుకు? అసలు రంగు బయటపడిందనా?’’ అంటూ ఎద్దేవా చేశారు. ( ఉపరాష్ట్రపతిని కలిసిన విజయసాయిరెడ్డి)

అంతకు క్రితం ‘‘దళితులపై దాడులను ఏమాత్రం ఉపేక్షించబోమని సీఎం వైఎస్‌ జగన్ స్పష్టం చేశారు. పోలీసు అధికారులైనా జైలు తప్పదని తేల్చిచెప్పారు. దళితునిగా పుట్టాలని ఎవరు కోరుకుంటారన్న జూమ్ బాబెక్కడ? వారి అభ్యుదయం కోసం కృషి చేస్తున్న జగన్ గారెక్కడ?’’ అని అన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement