భగవంతుడి దయ, శ్రేయోభిలాషుల ప్రార్థనల బలం..

Vijayasai Reddy Recovered From Corona - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కరోనా నుంచి కోలుకున్నారు. దాదాపు పదిరోజుల నుంచి హోం ఐసోలేషన్‌లో ఉంటున్న ఆయన శనివారం రోజున కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో.. 'భగవంతుడి దయతో, శ్రేయోభిలాషుల ప్రార్థనల బలంతో కోలుకున్నాను. అందరికీ కృతజ్ఞుడిని. మానవాళి అస్థిత్వానికి సవాలుగా మారిన కరోనాను ప్రతి ఒక్కరూ జయించాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను' అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.  (అన్‌లాక్‌ 3.0: స్పందనలో ఈ-పాస్‌లు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top