సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్.. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి నియోజకవర్గ ఇంఛార్జ్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితులు, సంస్థాగత అంశాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై వారితో వైఎస్ జగన్ చర్చించనున్నారు.


