తాట తీస్తా.. తోలు తీస్తా.. అన్నావ్ కదా పవన్‌ ఇప్పుడు ఏమైంది? | Varudu Kalyani Slams Pawan Kalyan And Vangalapudi Anitha | Sakshi
Sakshi News home page

తాట తీస్తా.. తోలు తీస్తా.. అన్నావ్ కదా పవన్‌ ఇప్పుడు ఏమైంది?

Jun 17 2025 5:13 PM | Updated on Jun 17 2025 5:34 PM

Varudu Kalyani Slams Pawan Kalyan And Vangalapudi Anitha

సాక్షి,విశాఖ: రాష్ట్రంలో మహిళలపై దారుణాలు జరుగుతుంటే తాట తీస్తా.. తోలు తీస్తానన్న పవన్‌ కల్యాణ్‌ ఏమయ్యారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు.

సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్త ఓ మహిళను నడిరోడ్డుపై అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా రోడ్డుపై ఈడ్చుకెళ్లి.. చెట్టుకు తాళ్లతో కట్టేసి చిత్రహింసలకు గురి చేశాడు. ఆ ఘటనపై వరుదు కల్యాణి మీడియాతో మాట్లాడారు.

మహిళలు, బాలికలపై వరుస అఘాయిత్యాలు జరుగుతున్నాయి. విశాఖలో టీడీడీపీ కార్యకర్త మహిళను వివస్త్ర చేసి దాడి చేసినా పట్టించుకోలేదు.సత్యసాయి జిల్లాలో బాలికపై లైంగికదాడికి పాల్పడింది టీడీపీ వాళ్లే. నిందితులు అధికార టీడీపీకి చెందిన వాళ్లే కావడంతో ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. రాష్ట్రంలో భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి.  

మహిళలపై ఎవరైనా చేయివేస్తే తాట తీస్తానన్న పవన్‌ ఎక్కడున్నారు?మహిళల భద్రతను గాలికొదిలేశారు. హోంమంత్రి అనిత ఏం చేస్తున్నారు?. రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి ఇచ్చిన ప్రాధాన్యత మహిళల భద్రతకు ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు.  

Advertisement
 
Advertisement
Advertisement