చంద్రబాబు చేతిలో షర్మిల కీలుబొమ్మ: వరుదు కళ్యాణి | Varudu Kalyani Serious On Sharila Chandrababu or Jagan Assets issue | Sakshi
Sakshi News home page

చంద్రబాబు చేతిలో షర్మిల కీలుబొమ్మ: వరుదు కళ్యాణి

Oct 26 2024 7:43 PM | Updated on Oct 26 2024 8:17 PM

Varudu Kalyani Serious On Sharila Chandrababu or Jagan Assets issue

సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు చేతిలో వైఎస్‌ షర్మిల కీలు బొమ్మలా మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. షర్మిల మాటలు వైఎస్సార్‌ కుమార్తెల లేవని విమర్శించారు.సొంత అన్న అనే అనుబంధం లేకుండా షర్మిల మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుతో కలిసి షర్మిల చేసే కుట్రలు చూసి, స్వర్గంలో వైఎస్సార్‌ కూడా బాధపడతారని అన్నారు. షర్మిలలో అడుగడుగునా స్వార్థం కనిపిస్తుందని దుయ్యబట్టారు.

చంద్రబాబు అడుగుజాడల్లో షర్మిల నడుస్తున్నారని అన్నారు వరుదు కళ్యాణి. ఈడీ కేసుల్లో భారతి ఆస్తులు కూడా జప్తు చేశారని చెప్పారు. నాడు కేసుల్లో వైఎస్సార్‌ పేరును కాంగ్రెస్ పార్టీ చేర్చిందని.. అయితే ఆనాడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ద్వారా పోరాడి వైఎస్సార్‌ పేరును తొలగించారని ప్రస్తావించారు. తప్పుడు మార్గంలో షేర్లు బదిలీ చేశారని జగన్ కోర్టుకు వెళ్ళారని, షర్మిల అండ్ కో చేసే కీడు నుంచి తప్పించుకోడానికి మాత్రమే ఆయన కోర్టుకు వెళ్లారని స్పష్టం చేశారు.
చదవండి:షర్మిలకు మానవత్వం ఉందా..?: టీజేఆర్‌ సుధాకర్‌బాబు

‘జగన్ బెయిల్ రద్దు అయితే లక్షల కుటుంబాలు రోడ్డున పడేవి. సొంత అన్న కోసం ఇంత దారుణంగా ఎవరైనా మాట్లాడుతారా? రక్తం పంచుకొని పుట్టిన అన్న కోసం ఇలా మాట్లాడటం దుర్మార్గం. మహిళలను గొప్పగా చూసే వ్యక్తి వైఎస్ జగన్. షర్మిల చేస్తున్న తప్పుడు ఆరోపణలు ఎవరూ నమ్మరు. 2019లో షర్మిల అధికారంలోకి తీసుకొస్తే.. 2014లో ఎందుకు అధికారానికి దూరం అయ్యాం. 

షర్మిల ఇలాంటి మాటలు మాట్లాడి చంద్రబాబు కనుసన్నల్లో నడవడం దుర్మాగం. వైఎస్సార్‌ వారసత్వన్ని నిలబెట్టిన వ్యక్తి జగన్. పుట్టింటి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత షర్మిలపై ఉంది. షర్మిల చంద్రబాబు కబంద హస్తాల నుంచి బయటకు రావాలి’ అని వరుదు కళ్యాణి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement