‘యు ట్యాక్స్‌’ పచ్చి అబద్ధం: ఉత్తమ్‌ | Sakshi
Sakshi News home page

‘యు ట్యాక్స్‌’ పచ్చి అబద్ధం: ఉత్తమ్‌

Published Wed, May 22 2024 4:38 AM

Uttam Kumar Reddy comments over Alleti Maheshwar Reddy

మహేశ్వర్‌రెడ్డి ఆరోపణలకు జవాబిస్తా

సాక్షి, హైదరాబాద్‌: నిత్యం వార్తల్లో ఉండాలనే ఆత్రుతతో కనీస అవగాహన కూడా లేకుండా బీజేపీ నేతలు నిరాధార, అసత్య ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ఆ పార్టీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చేసిన యు ట్యాక్స్‌ ఆరోపణలు పచ్చి అబద్ధమని స్పష్టం చేశారు.

 కుటుంబ సభ్యులతో కలిసి ఇతర రాష్ట్రాల్లో తీర్థయాత్ర చేస్తున్న మంత్రి ఉత్తమ్‌ ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘వంద రోజుల్లో తెలంగాణలో అద్భుత పాలన అందించాం. అస్తవ్యస్తంగా ఉన్న పాలనను గాడిలో పెట్టి నడిపిస్తున్నాం. యు ట్యాక్స్‌ వసూలు చేస్తున్నామనడం దుర్మార్గం. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌కు వస్తున్నా. మహేశ్వర్‌రెడ్డి చేసిన అన్ని ఆరోపణలకు తగిన జవాబు చెప్తా..’అని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement