‘పరిపాలన చేతకాక, హామీలు అమలు చేయలేక చేతులెత్తేశారు’ | Union Minister Kishan Reddy Takes On Congress Govt Over Ruling In Telangana, More Details Inside | Sakshi
Sakshi News home page

‘పరిపాలన చేతకాక, హామీలు అమలు చేయలేక చేతులెత్తేశారు’

Jun 22 2025 5:33 PM | Updated on Jun 22 2025 6:13 PM

Union Minister Kishan Reddy Takes On Congress Govt

హైదరాబాద్‌: ధనిక రాష్ట్రంగా మొదలైన తెలంగాణ.. లక్షల కోట్లు అప్పుల పాలైందని కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ కిషన్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే..  ఒక కుటుంబం బారినపడి బలి అయ్యిందని మండిపడ్డారు.  అవినీతి పాలనతో, దోపిడితో,, కుంభకోణాలతో, అహంకారంతో, కుటుంబ పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని దెబ్బ తీశారని ద్వజమెత్తారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా బీఆర్‌ఎస్‌ పార్టీని ఏ రకంగా పని చేసిందో మనం చూశామని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. 

ఇక గడిచిన ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్‌ను నమ్మి ఓటేస్తే  ఆ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసిందన్నారు. మహిళలు, రైతులు, నిరుద్యోగ యువకులు, దళితులకు డిక్లరేషన్ల పేరుతో అనేక హామీలు ఇచ్చి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. అప్పులు ఇచ్చే వారు లేరని, తనను నమ్మే వాడు లేడని సీఎం రేవంత్‌రెడ్డి చేతులెత్తేశాడన్నారు.  పరిపాలన చేతకాక, హామాలు అమలు చేయలేక కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో చేతులెత్తేసిందని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement