రేవంత్‌.. ఆ మొనగాడు ఇంకా పుట్టలేదు: కిషన్‌రెడ్డి | Union Minister Kishan Reddy Responds On CM Revanth Comments | Sakshi
Sakshi News home page

రేవంత్‌.. ఆ మొనగాడు ఇంకా పుట్టలేదు: కిషన్‌రెడ్డి

Jun 7 2026 7:23 PM | Updated on Jun 7 2026 7:46 PM

Union Minister Kishan Reddy Responds On CM Revanth Comments

హైదరాబాద్‌:  తనపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కౌంటరిచ్చారు. తనను పొలిమేర దాటించే మొనగాడు పుట్టలేదంటూ రేవంత్‌కు రిప్లై ఇచ్చారు. ‘రేవంత్‌ రాజకీయపరమైన నిరాశ, నిస్పృహల్లో ఉన్నారు. నన్ను పొలిమేర దాటించే మొనగాడు పుట్టలేదు. నాకు రేవంత్‌ సర్టిఫికేట్‌ అవసరం లేదు. ఈ జన్మలో రాహుల్‌ ప్రధాని కాలేడు. కాంగ్రెస్‌ను ప్రజలు అడ్రస్‌ లేకుండా చేస్తారు’ అని పేర్కొన్నారు. 

కాగా, నిన్న(శనివారం, జూన్‌ 6వ తేదీ) కోహెడలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్‌ సహా ఇంటిగ్రేటెడ్‌ రిజిస్ట్రేషన్‌ భవనాల సముదాయాల నిర్మాణానికి సీఎం రేవంత్‌ శంకుస్థాపన చేసిన క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ..  ‘కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి తమాషాలు చేస్తున్నారు. చేతకాకపోతే దిగిపో అంటున్నరు. నేను అల్లాటప్పాగా రాలేదు. కష్టపడి, తొక్కుకుంటూ వచ్చా. కార్యకర్తలు కష్టపడితే వచ్చా. 

అవసరమైతే ఫాంహౌస్‌లో కేడీతోనైనా..ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడతా. ఎవరి మెడలైనా వంచుతా. 12 ఏళ్లు అయింది. ముందు మోదీని గద్దె దిగమనండి. రాహుల్‌గాం«దీతో ధాన్యం కొనుగోలు చేయిస్తా. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు చేయిస్తా, మెట్రో విస్తరణ, రీజినల్‌ రింగ్‌రోడ్డుకు నిధులు తెస్తా. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణను అభివృద్ధి చేస్తా. మాటలతోపాటు చేతలు కూడా వచ్చు. 

ఈ నెల 15తో 75 లక్షల మెట్రిక్‌ ధాన్యం సేకరణ పూర్తవుతుంది. ఆ తర్వాత కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ సంగతి చెబుతా. మక్కలు ఎలా కొనుగోలు చేయరో తేలుస్తా. పొలిమేర్లు కూడా దాటలేరు. కేంద్రంలో మీ ప్రభుత్వం ఉందని, భయపెడితే.. భయపడే వాడిని కాదు. గుండు, అరగుండు మాట్లాడే మాటలన్నీ చూస్తున్నా. కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకొని, మన అవసరాలు వారికి వివరించి అవసరమైన నిధులు తెస్తా’ అని పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement