‘ప్రజల వద్దకు వెళ్లాలి.. మోదీ పాలనను వివరించాలి’ | Union Minister Kishan Reddy Comments At BJP Work Shop, Check More About His Speech Inside | Sakshi
Sakshi News home page

‘ప్రజల వద్దకు వెళ్లాలి.. మోదీ పాలనను వివరించాలి’

Jun 1 2025 4:49 PM | Updated on Jun 1 2025 5:25 PM

Union Minister Kishan Reddy Comments At BJP Work Shop

హైదరాబాద్:  ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలోని ప్రజలకు నీతివంతమైన పాలన అందించామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 11 ఏళ్లుగా మోదీ పాలన అనేది ఎంతో పారదర్శకతతో సాగుతుందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన వర్క్ షాపులో బీజేపీ శ్రేణులను ఉద్దేశించి కిషన్ రెడ్డి మాట్లాడారు. ‘ మనం ప్రజల వద్దకు వెళ్లాలి. 11 ఏళ్ల మోదీ పాలనను ప్రజలకు వివరించాలి. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వివరించాలి. నీతివంతమైన పాలన అందించాం. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. గత యూపీఏ నేతృత్వంలోని  కాంగ్రెస్ ప్రభుత్వంలో కుంభకోణాలు జరిగాయి.

రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం ముందుకు పోతుంది. వన్ నేషన్ వన్ రేషన్ దేశంలో అమలు చేస్తున్నాం. ఉగ్రవాద రహిత  దేశంగా చేసేందుకు మోదీ చర్యలు తీసుకుంటున్నారు. ఉగ్రవాదుల స్థావరాలను ఎలా ధ్వంసం చేశామో అందరూ చూశారు. మోదీ ఆధ్వర్యంలో నయా దేశంగా భారత్

13 వందల రైల్వే స్టేషన్ లను దేశంలో ఆధునీకరణ చేస్తున్నాం. వ్యాపార, వాణిజ్య, విద్యుత్ రంగుల్లో ఘనమైన అభివృద్ధి సాధించాం. దేశ అభివృద్ధి పై  చర్చకు సిద్ధమంటూ కాంగ్రెస్ కు సవాల్

బీజేపీ మహిళా పక్షపాతి పార్టీ. కుల మతాలకు అతీతంగా పని చేస్తున్న ప్రభుత్వం. బీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి  నక్కకు నాకలోకానికి ఉన్నత తేడా ఉంది. ఆర్మీలో స్వయం ప్రతిపతి సాధించాం. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతున్నాం. అభివృద్ధి చెందిన దేశాల సరసన నిల్పాలన్నదే మోదీ లక్ష్యం. తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. 10 లక్షల కోట్ల అప్పులు.. Brs, కాంగ్రెస్ రెండు కలిసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాయి.

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి వికేంద్రీకరణ.  బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి కేంద్రీకృతం. ప్రజా సమస్యల పై చిత్తశుద్ధితో పని చేస్తున్న పార్టీ బీజేపీ. బీజేపీ తప్పా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ పార్టీ కాపాడలేదు’ అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement