కాంగ్రెస్‌కు ఓటేస్తే.. ఆ నేతలు బీఆర్‌ఎస్‌లో చేరతారు: అమిత్ షా | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు ఓటేస్తే.. ఆ నేతలు బీఆర్‌ఎస్‌లో చేరతారు: అమిత్ షా

Published Sun, Nov 26 2023 3:58 PM

Union Minister Amit Shah Meeting In Mulugu - Sakshi

ములుగు: కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ ఆ నేతలు బీఆర్‌ఎస్‌లో చేరుతారని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. కేసీఆర్‌ను గద్దె దించాలంటే బీజేపీకి ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోడు భూముల సమస్య పరిష్కరించలేక.. గిరిజనులకు, గిరిజనేతరులకు మధ్య బీఆర్‌ఎస్ వివాదం సృష్టిస్తోందని మండిపడ్డారు. గిరిజనులను కేసీఆర్ నిర్లక్ష‍్యం చేశారని దుయ్యబట్టారు. ములుగులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. 

గిరిజనులను మోసం చేయడం కాంగ్రెస్ లక్షణమని అమిత్ షా ఆరోపించారు. కాంగ్రెస్ గిరిజన వ్యతిరేక పార్టీ అని చెప్పారు. తెలంగాణలో ప్రధాని మోదీ గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. అత్యధిక గిరిజన ఎంపీలు బీజేపీకి చెందినవారే ఉన్నారని స్పష్టం చేశారు. సమ్మక్క సారక్క పండుగలను జాతీయ పండుగగా చేయాలని ప్రకటించామని చెప్పారు. 

నవంబర్ 30న రాష్ట్రంలో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రధాని మోదీ కూడా ఇక్కడే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తూప్రాన్‌లో జరిగిన సభలో మాట్లాడారు. అటు.. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.   

ఇదీ చదవండి: ఏం మేలు జరిగిందని ఇందిరమ్మ రాజ్యం రావాలి?: కేసీఆర్‌


 

Advertisement
Advertisement