ప్రజలు కోరుకుంది ఇలాంటి తెలంగాణ కాదు: రాహుల్‌ గాంధీ | Sakshi
Sakshi News home page

ప్రజలు కోరుకుంది ఇలాంటి తెలంగాణ కాదు: రాహుల్‌ గాంధీ

Published Sat, Nov 25 2023 2:05 PM

TS Elections 2023: Rahul Gandhi Speech Bodhan Public Meeting - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: తెలంగాణలో ప్రజాపాలన కనిపించడం లేదని.. కుటుంబ, అవినీతి పాలనతో తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని.. కాంగ్రెస్‌తోనే రాష్ట్రం మళ్లీ కోలుకోలగదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. శనివారం బోధన్‌లో ఎన్నికల ప్రచార సభలో రాహుల్‌ ప్రసంగించారు. 

‘‘ తెలంగాణలో దొరల పాలన కొనసాగుతోంది. ధరణి పేరుతో ఎమ్మెల్యేలకు భూములు అప్పజెప్తున్నారు. దళిత బంధు పథకంలో తీవ్ర అవినీతి జరిగింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు కమీషన్‌ ఇవ్వకుంటే దళిత బంధు రాదు. తెలంగాణలో భూ, ఇసుక, వైన్స్‌ మాఫియా పెరిగింది. ఆ వచ్చే డబ్బంతా కేసీఆర్‌ ఇంటికే చేరింది. 

.. ఎస్సీ సబ్‌ ప్లాన్‌ నిధుల్ని కేసీఆర్‌ సర్కార్‌ ఎస్సీల కోసం ఖర్చు చేయలేదు. కుటుంబ, అవినీతి పాలనతో తెలంగాణ తీవ్రంగా నష్టపోయింది అని రాహుల్‌ గాంధీ అన్నారు. 

బీఆర్‌ఎస్‌, బీజేపీ పాలనలో గ్యాస్‌ సిలిండర్‌ రూ.1200గా ఉంది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే సిలిండర్‌ ధర తగ్గిస్తాం. కాంగ్రెస్‌ గెలిచాక.. ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తాం. కేసీఆర్‌ కారు పంక్చర్‌ అయ్యింది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు రాహుల్‌ గాంధీ. 

కాంగ్రెస్‌లో చేరిన మండవ
బోధన్‌ కాంగ్రెస్‌ విజయభేరి సభలో సీనియర్‌ నేత మండవ వెంకటేశ్వరరావు రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పేసుకున్నారు. 

ఆదిలాబాద్‌ ఎన్నికల సభలో మాట్లాడుతూ..
ఇసుకలో.. మైనింగ్‌లో.. ఎటు నుంచి చూసినా కేసీఆర్‌ ప్రజా ధనాన్ని దోచుకునే పనిలో ఉన్నారు. ధరణి తెలంగాణలో దొరలు మీ భూములు లాక్కుంటున్నారు. తెలంగాణ మంతత్రులందరూ ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. 8,000 మంది రైతులు దొరల తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రజలు ఆశించింది ఇలాంటి తెలంగాణ కాదు. ఎవరి భూములు వారికి ఇచ్చేదే ప్రజా తెలంగాణ. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల్ని మళ్లీ దళితుల అభివృద్ధి అని గండికొట్టారు. మీ స్వప్నాన్ని కేసీఆర్‌, మంత్రులు నాశనం చేశారు. మీ చేతుల్లో తెలంగాణ గ్యారెంటీ కార్డు పెట్టాం. ఇవి గ్యారెంటీలు కావు(కాంగ్రెస్‌ గ్యారెంటీ ప్రతిని చూపిస్తూ..) చట్టంగా అమలు చేయబోతున్నాం. తొలి కేబినెట్‌లోనే వీటిని చట్టాలుగా మారుస్తాం. 

Advertisement
Advertisement