సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే బీఆర్‌ఎస్ నేతల ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం తెలంగాణలో పాజిటివ్ వేవ్ కనిపిస్తుంది. మళ్లీ వచ్చేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని మహేష్ గౌడ్ అన్నారు.
బీసీలకు 42 శాతం చట్టబద్దంగా చేయాలనుకున్నాం. కానీ కేంద్రంలోని బీజేపీ అడుగడుగునా అడ్డు పడుతుంది. క్యాబినెట్ విస్తరణ సీఎం, పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. పీసీసీ అధ్యక్షుడిగా చాలా సంతోషంగా ఉన్నా.. నేను మంత్రి పదవి కావాలని ఎక్కడ ఆడగలేదు. పార్టీలో నేను ఆర్గనైజషన్ నుంచి వచ్చాను. పార్టీ అప్పగించే బాధ్యతను నిర్వర్తిస్తాను. నేను మంత్రి వర్గంలోకి వెళ్లాలని ఆరాటం పడటం లేదు. నాకు సీఎంతో పాటు మంత్రివర్గం మొత్తం పూర్తి సహకారం అందిస్తున్నారు. నాకు, సీఎంకు ఎలాంటి గ్యాప్ లేదు’’ అని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు.


