‘ఈటెల బీజేపీలో ఉంటూ బీఆర్ఎస్‌ కోసం పనిచేస్తున్నారు’ | TPCC Chief Mahesh Goud Slams BRS And BJP | Sakshi
Sakshi News home page

‘ఈటెల బీజేపీలో ఉంటూ బీఆర్ఎస్‌ కోసం పనిచేస్తున్నారు’

May 30 2025 4:33 PM | Updated on May 30 2025 5:01 PM

TPCC Chief Mahesh Goud Slams BRS And BJP

హైదరాబాద్:   బీఆర్ఎస్, బీజేపీ ఒప్పందాన్ని  ఎమ్మెల్సీ కవిత బహిర్గతం చేశారంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ధ్వజమెత్తారు. కేసీఆర్, కిషన్ రెడ్డిల లోపాయకారి ఒప్పందంతోనే బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించారంటూ విమర్శలు గుప్పించారు మహేష్ గౌడ్. ముందుగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ అధినాయకత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  

బీజేపీలో ఎవరికి ఎంత ప్యాకేజ్ అందిందో బహిర్గతం చేయాలన్నారు మహేష్ గౌడ్.  ఎంపీ ఈటెల రాజేందర్ బీజేపీలో ఉంటూ బీఆర్ఎస్ కోసం పని చేస్తున్నారని ఆరోపించారు.కాళేశ్వరం కమిషన్ నోటీసుల తర్వాత హరీష్ రావు,  ఈటెల సమావేశమయ్యారని, ఈ భేటీలో ఈ భేటీ లో కేసీఆర్ తో ఈటెల ఫోన్ లో మాట్లాడారంటూ మహేష్ గౌడ్ పేర్కొన్నారు.

ట్రంప్‌కు భయపడే యుద్ధం ఆపేశారా?
ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ పై యుద్ధానికి దిగిన భారత్.. మధ్యలో యుద్ధాన్ని ఆపడానికి కారణమేంటని ప్రశ్నించారు మహేష్ గౌడ్.   అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు భయపడే యుద్ధాన్ని మధ్యలో ఆపేశారా? అంటూ నిలదీశారు.‘యుద్ధంను మధ్య లో ఎందుకు ఆపారు.ట్రంప్ జోక్యం పై మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు.పాకిస్థాన్- భారత్ యుద్ధంలో దేశం సాదించింది ఏంటి?, పోగుట్టుకుంది ఏంటో దేశ ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు. యుద్ధం అంటే ఇంధిరా గాంధీ గుర్తుకు వస్తారు. కొన్ని వందల సర్జికల్ స్ట్రైక్స్ ఇంధిరా గాంధీ హాయాంలో జరిగాయి... కానీ ఎప్పుడూ రాజకీయం చేయలేదు’ అని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement