ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబే | TJR Sudhakar babu Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబే

Mar 24 2021 4:41 AM | Updated on Mar 24 2021 4:41 AM

TJR Sudhakar babu Comments On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టింది చంద్రబాబేనని, ఆయనే ప్రత్యేక హోదా ద్రోహి అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో ఉన్న వైఎస్సార్‌సీపీని తప్పుపట్టే స్థాయి టీడీపీకి లేదన్నారు. తాడేపల్లిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా గురించి అచ్చెన్నాయుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. నాడు బీజేపీతో జత కట్టి,  హోదాకు బదులు ప్యాకేజీ బాగుందన్న చంద్రబాబు మాటలను ఆంబోతు అచ్చెన్నాయుడు మర్చిపోయారని ఎద్దేవా చేశారు.

ప్రత్యేక హోదా కోరుతూ లోక్‌సభ నుంచి వైఎస్సార్‌సీపీ ఎంపీలు వాకౌట్‌ చేసిన విషయాన్ని అచ్చెన్నాయుడు మర్చిపోయినా రాష్ట్ర ప్రజలు మర్చిపోరన్నారు. ప్రత్యేక హోదా కోసం నాడు వైఎస్సార్‌సీపీ ఎంపీలంతా మూకుమ్మడిగా రాజీనామా చేయడం వాస్తవం కాదా అని నిలదీశారు. ఇసుక తవ్వకాల్లో రూ.10 వేల కోట్ల దోపిడీ జరిగినట్టు టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి వ్యాఖ్యల ద్వారా టీడీపీకి చెందిన బ్రోకర్లను, దళారులను, జన్మభూమి కమిటీల పేరుతో దోపిడీ, దొంగల ముఠాలను ఇసుక రీచ్‌లలో పెట్టి ఐదేళ్లలో రూ.50 వేల కోట్లను స్వాహా చేసినట్టు ఒప్పుకున్నట్టేనని అర్థమవుతోందన్నారు. ఇసుక ఎక్కడైనా ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే ఎక్కువ అడిగినా, వసూలు చేసినా వెంటనే ఫిర్యాదు చేయడం కోసం టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేశామని చెప్పారు.  

Advertisement
 
Advertisement
Advertisement