ఉద్రిక్తత.. తలారి రంగయ్య పాదయాత్రకు టీడీపీ అడ్డంకులు | Tdp Leaders Are Creating Obstacles For Talari Rangaiah Padayatra | Sakshi
Sakshi News home page

ఉద్రిక్తత.. తలారి రంగయ్య పాదయాత్రకు టీడీపీ అడ్డంకులు

Jun 15 2025 9:53 AM | Updated on Jun 15 2025 12:40 PM

Tdp Leaders Are Creating Obstacles For Talari Rangaiah Padayatra

సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో సేవ్‌ ఆర్డీటీ పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కళ్యాణ దుర్గం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్య పాదయాత్రపై పోలీసులు ఆంక్షలు విధించారు. బాల వెంకటాపురం గ్రామంలో పాదయాత్ర చేయొద్దంటూ పోలీసులు హుకుం జారీ చేశారు.

బాల వెంకటాపురంలో రాత్రికి రాత్రే టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఫ్లెక్సీలు వెలిశాయి. వైఎస్సార్‌సీపీ నేతల అల్పాహార శిబిరాన్ని పోలీసులు తొలగించారు. పోలీసుల తీరుపై మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. నిస్వార్థ సేవలు అందిస్తున్న రూరల్ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్ (ఆర్డీటీ) కి విదేశీ నిధులు ఆపొద్దని కోరుతూ 16 రోజులుగా  మాజీ ఎంపీ తలారి రంగయ్య పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.

 

Advertisement
 
Advertisement
Advertisement