రొంపిచెర్లలో టీడీపీ నేతల బరితెగింపు | Tdp Leader Attacked Ysrcp Workers In Rompicherla Of Chittoor District | Sakshi
Sakshi News home page

రొంపిచెర్లలో టీడీపీ నేతల బరితెగింపు

Aug 18 2024 6:32 PM | Updated on Aug 18 2024 6:52 PM

Tdp Leader Attacked Ysrcp Workers In Rompicherla Of Chittoor District

రొంపిచెర్లలో టీడీపీ నేతలు బరితెగించారు. వైఎస్సార్‌సీపీ నేత వెంకటరమణ షాప్‌పై టీడీపీ నేతలు దాడి చేశారు.

సాక్షి, చిత్తూరు జిల్లా: రొంపిచెర్లలో టీడీపీ నేతలు బరితెగించారు. వైఎస్సార్‌సీపీ నేత వెంకటరమణ షాప్‌పై టీడీపీ నేతలు దాడి చేశారు. షాపుపై దాడి చేసి సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. దాడిని అడ్డుకున్న  వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఓబులేసుపైనా దాడి చేశారు. టీడీపీ నేతల దాడిలో ఓబులేసుకు తీవ్ర గాయాలు కావడంతో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదును పోలీసులు స్వీకరించకపోవడంతో ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

టీడీపీ నేతల వేధింపులకు మహిళ మృతి
మరో ఘటనలో టీడీపీ నేతల వేధింపులు తట్టుకోలేక మహిళ మృతిచెందింది. కుప్పం కేజీబీవీలో ఆయాగా పనిచేస్తున్న సెల్వమ్మను పనికిరావద్దని టీడీపీ నేతలు చెప్పడంతో మనస్తాపానికి గురైంది. వాటర్‌ సంపులో పడి ఆయా సెల్వమ్మ అనుమానాస్పదంగా మృతిచెందింది. ఆమె మృతికి టీడీపీ నేతలే కారణమని కుటుంబ సభ్యులు అంటున్నారు.

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement