తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్‌ విడుదల | Schedule Released For Two Mlc Posts In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్‌ విడుదల

Jan 4 2024 4:18 PM | Updated on Jan 4 2024 6:00 PM

Schedule Released For Two Mlc Posts In Telangana - Sakshi

తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ విడుదల చేసింది.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 11న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. 29న పోలింగ్‌ జరగనుంది.

ఎమ్మెల్యేలుగా ఎన్నికయిన కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీలుగా రాజీనామాతో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. వీరిద్దరూ ఎమ్మెల్యే కోటా కిందనే ఎన్నికయ్యారు. దీంతో ఈ రెండు స్థానాలకు ఈ నెల 29న పోలింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలను వెల్లడించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది.

►జనవరి 11న నోటిఫికేషన్‌
►నామినేషన్ల దాఖలుకు చివరితేదీ జనవరి 18
►జనవరి 19న నామినేషన్ల స్క్రూట్నీ
►నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ జనవరి 22
►జనవరి 29న ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్‌, కౌంటింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement