సాక్షి, తాడేపల్లి: సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను చంద్రబాబు దగా చేశారని వైఎస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా చంద్రబాబు పాలనలో దోపిడీ, హింస కొనసాగుతోంది. చంద్రబాబుకు రాజకీయంగా ఇదే లాస్ట్ టర్మ్. చంద్రబాబు పాలన అవినీతిలో కొత్త రికార్డులు సృష్టిస్తోందన్నారు.
‘‘సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా ప్రజల్ని దగా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన రోజు నుంచే మోసాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్‌ను గద్దెదించి చంద్రబాబు సీఎం పీఠమొక్కారు. వైఎస్సార్ ఆదర్శవంతమైన పాలన అందించారు. వైఎస్ జగన్ ఆచరణలో మంచి పాలన తీసుకొచ్చారు. చంద్రబాబు పాలనలో మార్పు వస్తుందని ఆశించాం.. కానీ అది జరగలేదు.
సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను చంద్రబాబు దగా చేశారు. చంద్రబాబు జీవితమంతా ప్రజలను వంచించడమే. రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని చంద్రబాబు మోసం చేశారు. చంద్రబాబు పాలనలో ప్రజలంతా విసిగిపోయి.. వైఎస్ జగన్ వైపు చూస్తున్నారు. ప్రజల గొంతుక వినిపించేలా ఇవాళ నిరసనలు బ్రహ్మాండంగా జరిగాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలంతా రోడ్డు మీదకు వస్తున్నారు. కూటమి సర్కార్ నిరసనలను అడ్డుకునే ప్రయత్నం చేసింది. పోలీసులతో నిరసనలను అణచివేయాలని చూశారు. పోలీసుల ఆంక్షలను దాటుకుని ప్రజలు నిరసనలను విజయవంతం చేశారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.



