
సాక్షి, తాడేపల్లి: ఏ పార్టీలోనైనా కొన్ని అసంతృప్తులు సహజమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మా పార్టీ మంచి ఫామ్‌లో ఉంది కాబట్టే.. పోటీ చేయటానికి నాయకులు పెద్దసంఖ్యలో వస్తున్నారన్నారు.
‘‘అసంతృప్తుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అసంతృప్తులు లేకపోతే అది చెల్లని పార్టీ అనుకుంటారు’ అని పేర్కొన్నారు. జనవరిలో విజయవాడలో భారీ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించబోతున్నాం. అంబేద్కర్ ఆశయ సాధనలో వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ ముందుంటుందని సజ్జల అన్నారు.
ఇదీ చదవండి: కులం పేరిట బాబు విష రాజకీయం