‘వయనాడ్‌’కు రాహుల్‌ రాజీనామా..? | Congress Key Meeting: Rahul Gandhi Likely To Resign From Wayanad Seat, May Retain Raebareli | Sakshi
Sakshi News home page

Congress Key Meeting: వయనాడ్‌ సీటుకు రాహుల్‌ రాజీనామా..? కాసేపట్లో కాంగ్రెస్‌ కీలక భేటీ

Published Mon, Jun 17 2024 4:22 PM | Last Updated on Mon, Jun 17 2024 4:46 PM

Rahul Likely To Resign From Wayanad Seat

సాక్షి,ఢిల్లీ: రాహుల్‌గాంధీ తాను గెలిచిన రెండు ఎంపీ సీట్లలో ఏ సీటును వదులుకుంటారనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ కేరళలోని వయనాడ్‌, ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ సీట్ల నుంచి భారీ మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. 

దీంతో ఈ రెండు సీట్లలో ఒకదానిని ఆయన వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ సీటు వదులుకుంటారనేది  సోమవారం(జూన్‌16) సాయంత్రం జరిగే కాంగ్రెస్‌ పార్టీ కీలక సమావేశంలో  నిర్ణయం తీసుకోనున్నారు. 

ఈ నెల 24 న ఎంపీల ప్రమాణ స్వీకారం నేపథ్యంలో రాహుల్‌ ఏ సీటు వదులుకోవాలనేదానిపై పార్టీ నిర్ణయించనుంది. కాగా, రాహుల్‌ వ్యూహాత్మకంగా కేరళలోని వయనాడ్‌ సీటునే వదులుకోవచ్చని తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement