నా పై వచ్చిన అతి పెద్ద ఆరోపణ అదే: ప్రధాని మోదీ | Sakshi
Sakshi News home page

నా జీవితంలో వచ్చిన అతి పెద్ద ఆరోపణ అదే: ప్రధాని మోదీ

Published Mon, May 20 2024 9:48 PM

Pm Modi Shares Interesting Thing About His Clothes

న్యూఢిల్లీ: గుజరాత్‌ సీఎంగా ఉన్నపుడు తాను ధరించే దుస్తుల విషయంలో మాజీ సీఎం ఒకరు  తనపై చేసిన ఆరోపణలను ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. ‘మోదీకి 250 జతల దుస్తులు ఉన్నాయంటూ మాజీ సీఎం అమర్‌సిన్హా చౌధరీ అప్పట్లో ఆరోపించారు. 

అది నా రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న అతిపెద్ద ఆరోపణ. నాపై వచ్చిన ఆరోపణలను అంగీకరిస్తున్నట్లు  ఓ బహిరంగ సభలో చెప్పాను. రూ. 250 కోట్లు దోచుకునే సీఎం కావాలా? 250 జతల దుస్తులున్న సీఎం కావాలా? అని ప్రజలను అడిగాను. 

ప్రజలు మాత్రం 250 జతల దుస్తులున్న సీఎం పనిచేస్తాడంటూ ముక్తకంఠంతో నినదించారు. ఆ తర్వాత నాపై ఆరోపణలు చేసే ధైర్యం ప్రత్యర్థులు చేయలేదు’ అని మోదీ పాత స్మృతులను పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ తాజాగా గుర్తు చేసుకున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement