Sakshi News home page

'హిందుత్వంతో వారికి ఏం సంబంధం లేదు' బీజేపీపై రాహుల్ ఫైర్‌..

Published Mon, Sep 11 2023 2:41 PM

Nothing To Do With Hinduism Rahul Gandhi Hits BJP At Paris  - Sakshi

ఢిల్లీ: బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూయిజంతో వారికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. హిందువులకు వారు చేసిందేమీ లేదని చెప్పారు. తాను భగవద్గీత, ఉపనిషత్‌లను చదివానని ఎక్కడా కూడా హిందువులు(బీజేపీ) వారి గురించి లేదని పేర్కొన్నారు. ఈ మేరకు ఫ్రాన్స్‌లో సైన్స్‌ పీఓ యూనివర్సిటీ విద్యార్ధులతో ముచ్చటించారు. 

"మీ కంటే బలహీనమైన వ్యక్తులను భయభ్రాంతులకు గురిచేయాలని లేదా హాని చేయాలని నేను ఏ హిందూ పుస్తకంలో చదవలేదు. ఏ హిందూ పండితుడి నుంచి వినలేదు. ఈ ఆలోచన, హిందూ జాతీయవాది అనేది పూర్తిగా తప్పు పదం. 'హిందూ జాతీయవాదులు'లకు హిందూ మతంతో ఎలాంటి సంబంధం లేదు" అని రాహుల్ గాంధీ అన్నారు. 

"బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌కు హిందూ మతంతో ఎటువంటి సంబంధం లేదు. వారు ఎలాగైనా అధికారం సాధించాలని చూస్తున్నారు. ఇందుకోసం వారు ఏదైనా చేస్తారు" అని ఆయన అన్నారు. ర్యాడికల్ హిందూ యువకులపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు రాహుల్ గాంధీ ఈ విధంగా సమాధానమిచ్చారు. 

రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ లోక్‌ సభ ఎంపీ తేజశ్వీ సూర్య తప్పుబట్టారు. రాహుల్‌ గాంధీకి మన ధర్మంపై చాలా తక్కువ అవగాహన ఉందని ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రపంచ వేదికలకు భారత్‌ నిలయంగా మారిందని చెప్పారు. జీ20 సమ్మిట్‌లో డిక్లరేషన్‌ను ప్రపంచ దేశాలు 100 శాతం ఆమోదించాయని గుర్తుచేశారు.

ఇదీ చదవండి: జీ20 డిన్నర్ మీటింగ్‌లో మమతా బెనర్జీ.. కాంగ్రెస్ అసంతృప్తి


 

Advertisement

What’s your opinion

Advertisement