జనసేనకు వెన్నుపోటేనా? | No Clarity On How many seats will TDP give to Jana Sena | Sakshi
Sakshi News home page

జనసేనకు వెన్నుపోటేనా?

Oct 21 2023 9:12 PM | Updated on Oct 22 2023 3:27 AM

No Clarity On How many seats will TDP give to Jana Sena - Sakshi

వెన్నుపోటు అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటేనే వెన్నుపోటు. ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌కు చంద్రబాబు నుంచి వెన్నుపోటు తప్పదా? సీట్ల సర్దుబాటు విషయంలో జనసేన వెనక్కి తగ్గాల్సిందేనా?, టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లతోనే జనసేన సరిపెట్టుకోవాల్సిందేనా? అంటే అవుననే పరిస్థితులే కనిపిస్తున్నాయి. 

టీడీపీతో పొత్తును ఆగమేఘాల మీద  ప్రకటించిన జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు డైలమాలో పడ్డారు. సీట్ల విషయంలో పవన్‌కు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఒకవైపు పవన్‌ సర్దుకుపోదామనుకున్నా..  జనసేన కనీన స్థానాల్లో పోటీ చేయకపోతే అభిమానులు మాత్రం జీర్ణించుకోలేరు.  కాగా, వెన్నుపోటు రాజకీయాలకు బ్రాండ్‌ అంబాసిడర్ ఎవరంటే టక్కున చెప్పే పేరు చంద్రబాబు ..  ఇప్పుడు తననునమ్ముకుని తిరుగుతున్న పవన్‌కు వెన్నుపోటు పొడవడం ఖాయమా?, ఇదే అంశం జన సైనికుల్లో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.  

అసలు జససేనకు టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తుందనే అంశంపై ‘సాక్షి. కామ్‌లో పోల్‌ క్వశ్చన్‌ నిర్వహించగా  10 నుంచి 20 సీట్లు మాత్రమే ఇచ్చే అవకాశం ఉందని ఎక్కువ శాతం మంది అభిప్రాయపడ్డారు.

గతంలో మామకు వెన్నుపోటు పొడిచిన తరహాలో పవన్‌కు కూడా వెన్నుపోటు తప్పదా అంటూ తర్జనభర్జనలు పడిపోతున్నారు. ఏపీ ఎన్నికల్లో జనసేనకు టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తుందనే దానిపై ఒక అంచనా రాలేకపోతున్నారు పవన్‌ అభిమానులు.  జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో ఇప్పటివరకూ క్లారిటీ లేదు. అసలు జనసేనకు టీడీపీ ఎన్ని సీట్లు కేటాయిస్తుందో అనే విషయం స్పష్టత లేకపోవడమే ఇందుకు కారణం.

మరొకవైపు చంద్రబాబు అరెస్టుతో టీడీపీ నేతలంతా నీరుగారిపోయారు. పార్టీ పనైపోయిందంటూ అంతర్గతంగా కుమిలిపోతున్నారు. నడిపించే నాయకుడు లేక తలోదారి చూసుకుంటున్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించిన సమయంలో టీడీపీ సీనియర్‌ నేతలంతా పక్కన విధేయులుగా నిలబడినా  ఈ ప్రకటనను ‘తమ్ముళ్లు’ జీర్ణించుకోలేకపోతున్నారు.  జనసేన పొత్తు అంశం తమ సీట్లకే ఎసరు తెస్తుందని తమ్ముళ్లలో కలవరం మొదలైంది. 

ఇది కూడా చదవండి: పవన్‌కు ఎందుకంత కడుపుమంట?


‘‘క్లిక్‌ చేసి వాట్సాప్‌ ఛానెల్‌ ఫాలో అవ్వండి’’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement