ఎల్లో మీడియాకు నటి కాదంబరీ జత్వానీ ఝలక్ | Mumbai Actress Jethwani Who Shocked The Yellow Media | Sakshi
Sakshi News home page

ఎల్లో మీడియాకు నటి కాదంబరీ జత్వానీ ఝలక్

Sep 19 2024 5:21 PM | Updated on Sep 19 2024 6:29 PM

Mumbai Actress Jethwani Who Shocked The Yellow Media

ఎల్లో మీడియాకు ముంబయి నటి జత్వానీ షాక్ ఇచ్చింది. తన కేసులో గత ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేదని జత్వానీ తెలిపింది.

సాక్షి, విజయవాడ: ఎల్లో మీడియాకు ముంబయి నటి జత్వానీ షాక్ ఇచ్చింది. తన కేసులో గత ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేదని జత్వానీ తెలిపింది. హోంమంత్రి అనితను కలిశాక జత్వానీ ఈ వ్యాఖ్యలు చేసింది. మీ కేసు విషయంలో గత ప్రభుత్వ ముఖ్యుల పాత్ర ఉందా..? అంటూ మీడియా ప్రశ్నకు సమాధానం మిస్తూ.. రాజకీయ ప్రమేయం లేదని జత్వానీ స్పష్టం చేసింది.

పొలిటికల్ ఇన్వాల్వ్‌మెంట్‌పై నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. తన కేసు విషయంలో మేనిపులేషన్ మాత్రం జరిగింది. దీనిని రాజకీయం చేయొద్దని తాను కోరుకుంటున్నానని చెప్పిందామె.

ఇదీ చదవండి: కాదంబరి కోరాలే గానీ..

జిందాల్ కుటుంబ సభ్యుల ప్రమేయంపై జత్వానీ నోరు విప్పలేదు. జిందాల్ కుటుంబ సభ్యుల పాత్ర ఉందా..?  అంటూ మీడియా ప్రశ్నించగా నో కామెంట్ అంటూ కాదంబరీ జత్వానీ వెళ్లిపోయారు. ఆమె మాట్లాడ దల్చుకోలేదని జత్వానీ తరఫు న్యాయవాది తెలిపారు. కేసు వెనుక అసలైన వివాదం జిందాల్ దే కదా అంటూ ప్రశ్నించగా.. తాను కామెంట్ చేయలేనని జత్వానీ పేర్కొంది.

నిజం కక్కిన జేత్వాని.. అంతా వాళ్లే చేయించారు..

 

 

Advertisement
 
Advertisement
Advertisement