టార్గెట్‌ టీడీపీ.. కేశినేని నాని మరోసారి సంచలన కామెంట్స్‌ | MP Kesineni Nani Sensational Comments Over TDP | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ టీడీపీ.. కేశినేని నాని మరోసారి సంచలన కామెంట్స్‌

Jan 6 2024 12:14 PM | Updated on Jan 31 2024 1:02 PM

MP Kesineni Nani Sensational Comments Over TDP - Sakshi

సాక్షి, ఎన్టీఆర్: టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు షాకిచ్చారు. కొందరు వ్యక్తులు తన కుటుంబాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అలాగే, త్వరలోనే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పకొచ్చారు. ఇందుకోసం లోక్‌సభ స్పీకర్‌ అనుమతి కూడా తీసుకున్నట్టు స్పష్టం చేశారు. 

కాగా, కేశినేని నాని శనివారం చందర్లపాడు మండలంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేశినేని నాని మాట్లాడుతూ.. టీడీపీకి రాజీనామా చేస్తున్నాను. లోక్‌సభ స్పీకర్‌ అనుమతి కూడా కోరాను. స్పీకర్‌ అపాయింట్‌మెంట్‌ ఇస్తే అప్పుడు వెళ్లి ఎంపీ పదవికి రాజీనామా చేస్తాను. తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తాను. ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేసి అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాను. 

రాజీనామా అనంతరం టార్గెట్‌ చేసేందుకు మా వాళ్లు ఏం చేయమంటే అదే చేస్తాను. ఇందులో నా సొంత నిర్ణయం ఉండదు. నేను ఏం చేసినా పారదర్శకంగా ఉంటుంది. నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తెల్లవారుజామున పోస్టులో పెడుతున్నాను. దాన్ని మీడియా ఫాల్‌ అవ్వండి. రోజూ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను. ఇక్కడి ప్రాంతం, ప్రజల కోసం పనిచేశాను. ప్రజలను, నాతో ఉన్న వాళ్ళను వదిలేసి నిర్ణయాలు తీసుకోలేను అని చెప్పుకొచ్చారు. 

ఇది కూడా చదవండి: చంద్రబాబుకు బిగ్‌ షాక్‌.. కేశినేని నాని సంచలన నిర్ణయం

Advertisement
 
Advertisement
Advertisement