సీబీఐ ఎంకై ్వరీ వేయాలి | - | Sakshi
Sakshi News home page

సీబీఐ ఎంకై ్వరీ వేయాలి

Aug 8 2026 1:47 AM | Updated on Aug 8 2026 1:47 AM

● డీఎస్సీ అక్రమాలకు కారకులైన మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాలి ● మాజీ మంత్రి పేర్ని నాని

పామర్రు: డీఎస్సీ ఉద్యోగ నియామకాల్లో జరిగిన అక్రమాలపై కూటమి ప్రభుత్వం వెంటనే సీబీఐ ఎంకై ్వరీ వేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య(నాని) డిమాండ్‌ చేశారు. పామర్రులో ఏపీ జెన్‌ జెడ్‌ వార్‌లో భాగంగా డీఎస్సీ అక్రమాలపై మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాలని కోరుతూ రెండో రోజు నిర్వహిస్తున్న రిలే దీక్షల్లో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్‌తో కలిసి మాజీ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ డీఎస్సీ బాధితులు ఎందుకు దీక్షల్లో పాల్గొనడం లేదని కొందరు ప్రశ్నిస్తున్నారన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పెట్టే తప్పుడు కేసులకు భయపడి రావడం లేదని తెలిపారు. మేడి పండులా ప్రభుత్వ తీరు ఉందని, పైకి బాగా కనపడుతోందని, లోలోపల కుళ్లి పోయిందని ఎద్దేవా చేశారు.

జగన్‌ పాలనలో నిజాయతీగా 2.40లక్షల ఉద్యోగాలు

గత జగన్‌ ప్రభుత్వ హయాంలో ఏకంగా 2.40లక్షల ఉద్యోగాలు నిజాయతీగా నిబద్ధతతో ఇచ్చామని గుర్తు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం ప్రతిభగల అభ్యర్థులను మోసం చేసిందన్నారు.

మరిన్ని ఉద్యోగాలకు మంగళం పాడతారు

జీతభత్యాల విషయంలో ఖర్చు తగ్గించామని చెబుతుతున్న చంద్రబాబు భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలకు మంగళం పాడతారని అర్థమవుతోందన్నారు. జగన్‌ ప్రభుత్వంలో రూ.25లక్షల విలువైన వైద్యాన్ని ఆరోగ్యశ్రీ కార్డుల ద్వారా అందించారన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఆరోగ్య శ్రీ కి మంగళం పాడి సీఎంఆర్‌ఎఫ్‌లు అంటూ కాలం వెళ్ల దీస్తున్నారని మండిపడ్డారు.

అమరావతితో ప్రజలను మోసం

అమరావతిలో రైతులను అడ్డం పెట్టుకుని జగన్‌ ప్రభుత్వంలో ఉద్యమాన్ని నిర్వహించారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తుతం ఏం చేస్తోందని విమర్శించారు. అక్కడి రైతులకు ఎంతసేపు కాగితాలపైనే తప్ప గ్రామాల్లో ఎక్కడా భూములు చూపించే పరిస్థితే లేదన్నారు. అమరావతిలో ఉన్న 26 గ్రామాల్లో మట్టిని లారీలతో ఇతర ప్రాంతాలకు తోలి కోట్లకు కోట్లను అక్రమార్జన చేసి కూటమినేతలు కుబేరులు అవుతున్నారని వివరించారు. జగన్‌ సూచించిన మావిగన్‌పై శ్రద్ధ లేకుండా చంద్రబాబు సీఆర్‌డీఏలో అమరావతితో పాటు విజయవాడ, గుంటూరును రాజధానిలో కలుపుతున్నామని సిగ్గు లేకుండా తీర్మానించారన్నారు.

రాజదాని నడిబొడ్డులో ఎమ్మెల్యే బరితెగింపు

రాజధాని నడిబొడ్డులో ఉన్న విజయవాడలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తే ఎమ్మెల్యే బొండా ఉమా పైశాచికంగా ప్రవర్తిస్తూ శిబిరాలను కూల్చడం, నాయకులపై తెగ బడటం , మహిళలపై కూడా అసభ్యంగా ప్రవర్తించడం దారుణమన్నారు. మంత్రి నారా లోకేష్‌ నాయుడు వెంటనే మంత్రి పదవి రాజీనామా చేయాలని, కేబినెట్‌లో డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని తీర్మానించాలని కోరారు. కార్యక్రమంలో పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్‌ , పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement