టీడీపీ హయాంలో 40వేలకు పైగా బెల్ట్‌షాపులు తెరిచారు: ఎమ్మెల్యే రోజా | MLA Roja Fires On Chandrababu At AP Assembly Budget Session | Sakshi
Sakshi News home page

టీడీపీ హయాంలో 40వేలకు పైగా బెల్ట్‌షాపులు తెరిచారు: ఎమ్మెల్యే రోజా

Mar 14 2022 1:27 PM | Updated on Mar 14 2022 1:49 PM

MLA Roja Fires On Chandrababu At AP Assembly Budget Session - Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు అయిదేళ్ల పాలనలో 40 వేలకు పైగా బెల్ట్‌షాపులు తెరిచారని ఎమ్మెల్యే ఆర్‌కే రోజా మండిపడ్డారు. మద్యం సిండికేట్లతో కుమ్మకై చంద్రబాబు నాయుడు ఆడవాళ్ల పసుపు కుంకుమలతో, జీవితాలతో చెలగాటమాడారని ధ్వజమెత్తారు. అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో బెల్ట్‌ షాపులు ఎత్తేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, తరువాత ఆ హామీని తుంగలో తొక్కారని విమర్శించారు. చంద్రబాబు చేసిన మోసాలను ప్రతి మహిళా గుర్తుపెట్టుకుందన్నారు. అందుకే టీడీపీ ప్రభుత్వాన్ని మహిళలు ఛీ కొట్టి తరిమికొట్టారని మండిపడ్డారు. 

గత ప్రభుత్వంలో మద్యం పాలసీ ఎలా ఉందని ప్రశ్నించిన రోజా చంద్రబాబు అయిదేళ్లలో 75 వేల కోట్ల మద్యాన్ని ఏరులై పారించారని మండిపడ్డారు. మద్యం బార్‌ లైసెన్స్‌ల అనుమతి ప్రతి ఏడాది రెన్యూవల్‌ చేయాలి. అలాంటిది 2017లోనే 2022 వరకు అనుమతులు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారని దుయ్యబట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇంటింటికి మినరల్‌ వాటర్‌ ఇచ్చారో లేదో కానీ ఇంటింటికి మద్యం బాటిళ్లు అందే పథకం మాత్రం పెట్టారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు 2014 నుంచి అయిదు సంవత్సరాల సమయంలో 6 వేల పాఠశాలలను మూసివేశారని గుర్తుచేశారు. 
చదవండి: ఏపీ అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement