అవును.. కవిత చెప్పింది నిజమే: ఎమ్మెల్యే రాజా సింగ్‌ | MLA Raja Singh Sensational Remarks On Own Party MLAs | Sakshi
Sakshi News home page

అవును.. కవిత చెప్పింది నిజమే: ఎమ్మెల్యే రాజా సింగ్‌

May 29 2025 3:02 PM | Updated on May 29 2025 3:24 PM

MLA Raja Singh Sensational Remarks On Own Party MLAs

సాక్షి,హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ను బీజేపీలో కలపాలనే ప్రతిపాదన వచ్చిందంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ సమర్ధించారు.

గురువారం పార్టీలోని కోవర్టులే తనని ఓడించారంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను 25ఏళ్లుగా కేసీఆర్‌కు లేఖలు రాస్తున్నా.. ఇప్పటి వరకు ఒక్క లేఖ కూడా లీకు కాలేదు. కానీ ఈ సారి రాసిన లేఖ ఎలా బహిర్ఘతం అయ్యింది. ఆ లీకు వీరులెవరో చెప్పాలి. నేను జైల్లో ఉండగా బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం జరిగింది.నేను పార్టీలో ఉంటే అది సాధ్యం కాదని, తనని కేసీఆర్‌కు దూరం చేయాలని చూస్తున్నారంటూ కవిత చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

అయితే, కవిత చేసిన వ్యాఖ్యలపై స్పందించిన రాజా సింగ్‌.. ఆఫ్ ద రికార్డు కవిత మాట్లాడినది నిజమే అని నేను అనుకుంటున్నాను. పెద్ద ప్యాకేజీ దొరుకుతే మా వాళ్ళు కూడా బీఆర్‌ఎస్‌తోనే కలిసిపోతారు. మా వాళ్లు కుమ్మక్కయ్యారు కాబట్టే బీజేపీకి నష్టం’ అని వ్యాఖ్యానించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement