కావాలంటే కేటీఆర్‌కు ఆ డేటా ఇస్తా: మంత్రి సీతక్క | Minister Seethakka Strong Counter To Ktr | Sakshi
Sakshi News home page

కావాలంటే కేటీఆర్‌కు ఆ డేటా ఇస్తా: మంత్రి సీతక్క

Aug 18 2024 9:03 PM | Updated on Aug 18 2024 9:16 PM

Minister Seethakka Strong Counter To Ktr

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మహిళలపై జరిగిన దాడులపై కూడా మహిళా కమిషన్‌కు కేటీఆర్‌ ఫిర్యాదు చేస్తే బాగుంటుందని మంత్రి సీతక్క కౌంటర్‌ ఇచ్చారు.

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మహిళలపై జరిగిన దాడులపై కూడా మహిళా కమిషన్‌కు కేటీఆర్‌ ఫిర్యాదు చేస్తే బాగుంటుందని మంత్రి సీతక్క కౌంటర్‌ ఇచ్చారు. ‘‘రాష్ట్రంలో 2014 -23 మధ్య మహిళలపై దాడుల డేటా మొత్తం నా దగ్గర ఉంది.. కావాలంటే కేటీఆర్‌కు ఆ డేటా ఇస్తా. మహిళా కమిషన్‌ను మేం కూడా కలుస్తాం’’ అని సీతక్క చెప్పారు.

యథాలాపంగా మాట్లాడా అంటూనే వాళ్ల పార్టీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ తిట్టిస్తున్నాడు. రుణమాఫీ చేతగాని ప్రభుత్వం బీఆర్ఎస్.. మేము పూర్తిగా రుణమాఫీ చేయకముందే విమర్శలు ఎందుకు? అంటూ సీతక్క దుయ్యబట్టారు.

తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బస్సుల్లో బ్రేక్ డాన్స్ లు, రికార్డింగ్ డాన్స్ లు చేసుకోవచ్చంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. తెలంగాణ మహిళల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ కేటీఆర్‌పై కాంగ్రెస్‌ మంత్రులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.


 


 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement