
సాక్షి, వరంగల్: నాటు బాంబు.. లక్ష్మిబాంబు కాదు.. త్వరలో ఆటమ్ బాంబ్ పేలబోతుందంటూ మరోసారి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం వర్దన్నపేట సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తప్పు చేసిన వారిని చట్టం వదిలిపెట్టదన్నారు. తప్పు చేయకపోతే ఉలికిపాటు ఎందుకు?. రూ.55 కోట్లు ఎక్కడికి వెళ్లాయో బయటపడతాయటూ వ్యాఖ్యానించారు. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తరుముకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు.
‘‘మీ ఆస్తులు పెంచుకోవడం కోసం పేదల సొమ్ము విదేశాలకు పంచిన వారిని చట్టం వదలదు. చట్టం తనపని తాను చేసుకుంటది.. పేదలను మరిచిపోయిన మీరు అధికార దాహంతో ఎలాంటి కుట్రలు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో తప్పకుండా దోషులుగా నిలబడాల్సిందే. కారుకూతలు కూస్తున్న నేతలు ఏ టైర్ కింద తలపెడతారు’’ అంటూ పొంగులేటి ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: పొంగులేటి.. జైలుకెళ్లడానికి రెడీగా ఉండు: కేటీఆర్