
సాక్షి,అమరావతి: శాసన మండలిలో మంత్రి నారా లోకేష్ సహనం కోల్పోయారు. పరుష పదజాలం ఉపయోగించారు. ‘ఏం పీకారు. మీరు పీకింది ఏంటి..?’ అంటూ నోరుపారేసుకున్నారు.
మంగళవారం శాసన మండలిలో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై చర్చ జరిగింది. చర్చ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపారు. కేంద్రమంత్రి కుమార స్వామి ఇదే విషయం చెప్పారు’ అంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ఘాటుగా సమాధానం ఇచ్చారు.
దీంతో నారా లోకేష్ సహనం కోల్పోయారు. ఏం పీకారు.. మీరు పీకింది ఏంటి..?అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలపై వాగ్వాదానికి దిగారు . అయితే, లోకేష్ భాషపై మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ సభకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.