ఈడీ చీఫ్‌గా బండి సంజయ్‌ 

Minister KTR Reacted Tweet On BJP Chief Bandi Sanjay - Sakshi

ట్విట్టర్‌లో కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ త్వరలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణ ఎదుర్కొంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా తీవ్రంగా స్పందించారు. ‘మోదీ గారూ.. మీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ను ఈడీ చీఫ్‌గా కూడా నియమించినందుకు ధన్యవాదాలు.

ప్రస్తుతం నిజంగానే ‘మోడీ, ఈడీ’అనే డబుల్‌ ఇంజిన్‌ నడుపుతున్నట్లు గుర్తిస్తున్నాం’అని ఎద్దేవా చేశారు. ప్రపంచ పేదరిక రాజధానిగా నైజీరియా స్థానంలో భారత్‌ చేరడం, బిల్‌గేట్స్‌ను అధిగమిస్తూ ప్రపంచంలోని అత్యంత« ధనవంతుల జాబితాలో అదానీ నాలుగోస్థానం సంపాదించడం అనేరెండు కఠోర వాస్తవాలు భారత పరిస్థితికి అద్దం పడుతున్నాయి’ అని కేటీఆర్‌ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. 

రైల్వేచార్జీల్లో రాయితీ తొలగింపు సరికాదు 
రైలు చార్జీల్లో సీనియర్‌ సిటిజన్లకు ఇన్నాళ్లూ ఇస్తున్న రాయితీని భారతీయ రైల్వే రద్దు చేసిందని వస్తు న్న వార్తలపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణ వ్‌ను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. ‘వృద్ధుల యోగక్షేమాలు చూసుకోవడం విధి కాదు, మన బాధ్యత. రైల్వేచార్జీల్లో వారికి ఇస్తున్న రాయితీని కేంద్రం తీసేసిందని వస్తున్న వార్తలు బాధాకరం. మీ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుని వారికి నష్టం జరగకుండా చూడాలని వినతి’ అని ట్వీట్‌ చేశారు. 

ద్రౌపదీ ముర్ముకు శుభాకాంక్షలు 
‘భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపదీ  ముర్ముగారికి శుభాకాంక్షలు. మీరు రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మహిళారిజర్వేషన్‌ బిల్లు, తెలంగాణలో గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు, అటవీ భూములపై హక్కుల చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలుపుతారని ఆశిస్తున్నాను’అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top